టీవీకే పార్టీ తొలి రాష్ట్ర సభలో ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రసింగించారు. తొలిసభలోనే జాతి నిర్మాతలు బీఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి, కామ రాజ్, వేలు నాచియార్, అంజలై అమ్మాళ్అడుగు జాడల్లో తమిళిగ వెట్రి కగజం పార్టీ పయనిస్తుందని అన్నారు.
రాజకీయాల్లో మేం చాలా చిన్న పిల్లలమని చాలా మంది వ్యాఖ్యానించారు. కానీ మేం ఆత్మవిశ్వాసం ముందుకు వెళతామని టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రకటిం చారు.
ALSO READ | నటుడు విజయ్ టీవీకే పార్టీ తొలిసభ..లక్షల్లో తరలివచ్చిన జనం
టీవీకే అధ్యక్షుడు విజయ్ తొలి ప్రసంగంలో బీజేపీ, డీఎంకేలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ, డీఎంకేలు అనుసరిస్తున్న ఫాసిజం, ద్రవిడ మోడల్ ను పై విరుచుకుపడ్డాడు.
తనను ఆర్టిస్ట్ గా పిలిచే విమర్శకులకు ఘాటు సమాధానం చెప్పారు. ఒకనాడు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలల్లో ప్రభంజనం సృష్టించిన ఎంజీఆర్, ఎన్టీఆర్ లు నటులు, ఆతర్వాతే రాజకీయాల్లో వచ్చారని అన్నారు.