![జ్యోతీష్యుడు చెప్పారని పక్కన పెట్టేశారట.. పాపం విజయ్ వర్మ](https://static.v6velugu.com/uploads/2023/12/actor-vijay-varma-emotionsl-comments-on-his-flim-journey_jIRr2bnHdv.jpg)
సాధారణంగా మన పెద్దలు ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు కానీ.. నటుడు విజయ్ వర్మ(Vijay Varma) మాత్రం దానికి పూర్తి వ్యతిరేకం. పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనైనా.. ముందు బాలీవుడ్ లో తన సత్తా చాటుకున్నాడు. అప్పుడెప్పుడో నాని మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో కనిపించిన విజయ్ వర్మ మల్లి ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా కనిపించలేదు. అంతలా బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటున్నాడు ఈ యాక్టర్.
అయితే తాను ఈ స్థాయికి రావడానికి మాత్రం చాలా ఇబ్బదులు ఎదుర్కొన్నారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ వర్మ సినీ ప్రయాణంలో తాను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ముంబైకి వచ్చి థియేటర్స్ చేస్తున్న సమయంలో బాలీవుడ్ నుండి నాకు చాలా సినిమా అవకాశాలు వచ్చాయి కానీ.. ఏ ఒక్కటి కూడా ఫైనల్ స్టేజి వరకు రాలేదు. మధ్యలోనే చేయి జారిపోయాయి.
నటుడిగా కెరీర్ ప్రారంబించిన కొత్తలో.. ఒక పెద్ద సంస్థ నుండి ఆఫర్ వచ్చింది. ఫోటోలు పంపిస్తే.. హీరోగా సెలెక్ట్ ఆయ్యావని చెప్పారు. ఆతరువాత కొన్నాళ్లకు ఆ ప్రాజెక్టు నుండి నన్ను తీసేసినట్లు చెప్పారు. కారణం ఏంటంటే.. ఆ దర్శకుడికి మూఢ నమ్మకాలు ఎక్కువ. ఎవరో జ్యోతిష్యుడు చెప్పారని ఆ ప్రాజెక్టు నుండి నన్ను తీసేశారు. ఆ విషయం తెలిసి చాలారోజులు బాధపడ్డాను. నటుడు నసీరుద్దీన్ షా ఆ సమయంలో నాకు సపోర్ట్ గా నిలిచారు. అప్పటినుండి ఒకే కల ఉండేది. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాను. కష్టపడ్డాను, వచ్చిన అవకాశాలను సరిగా వినియోగించుకున్నాను, నటుడిగా ఎదిగాను.. అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు విజయ్ వర్మ. ప్రస్తుతం విజయ్ వర్మ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read:-అఖండ 2 కోసం పవర్ఫుల్ కథ.. ఎక్కడ ముగించారో అక్కడే మొదలు!