నటుడు విజయ్ టీవీకే పార్టీ తొలిసభ..లక్షల్లో తరలివచ్చిన జనం

నటుడు విజయ్ టీవీకే పార్టీ తొలిసభ..లక్షల్లో తరలివచ్చిన జనం

సొంత పార్టీ తమిళగ వెట్రి కజగం( TVK) స్థాపించిన తర్వాత తమిళ సినీ నటుడు  విజయ్ తొలిసారి రాష్ట్రస్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తమిళనాడు లోని విల్లుపురం జిల్లాలో జరిగిన ఈ సభకు జనం భారీఎత్తున తరలివచ్చారు. దాదాపు 8 లక్షలకు పైగా జనం వచ్చి ఉంటారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సభకు తరలి వచ్చిన జనాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. 

Also Read :- స్టార్ హీరోయిన్ చనిపోయిందంటూ ప్రచారం.

తమిళ సినీ నటుడు జోసెఫ్ విజయ్ తన పార్టీ తమిళగ వెట్రి కజగం( TVK) ని ప్రారంభించి రాజకీయాల్లో అడుగుపెట్టిన 8నెలల తర్వాత పార్టీ తొలి బహిరంగ సభను తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని విక్రంవాడిలో నిర్వహించారు. 


2024 ఏడాది ఫిబ్రవరి 2న విజయ్ రాజకీయ ప్రవేశం చేశారు. ఆగస్ట్ 22న చెన్నై సమీపంలోని పనైయూర్‌లోని TVK ప్రధాన కార్యాలయంలో పార్టీ జెండా, పాటను ప్రారంభించారు. మూడు వారాలలోపే భారత ఎన్నికల సంఘం (ECI) తమిళగ వెట్రి కజగమ్‌ను రిజిస్టర్డ్ రాజకీయ పార్టీగా గుర్తించింది.