మార్చిలో విక్రమ్ వీర ధీర శూరన్‌‌

మార్చిలో విక్రమ్  వీర ధీర శూరన్‌‌

విక్రమ్ నుంచి రాబోతున్న చిత్రం ‘వీర ధీర శూరన్‌‌’.  ‘చిన్నా’ ఫేమ్‌‌ ఎస్ యు అరుణ్ కుమార్ దర్శకుడు. రియా శిబు నిర్మిస్తున్నారు. ఈ మూవీ సెకండ్ పార్ట్‌‌ను ముందుగా విడుదల చేయబోతున్నారు. బుధవారం రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేశారు.

 మార్చి 27న తమిళ,  తెలుగు,  హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. తెలుగులో ఎన్వీఆర్‌‌‌‌ సినిమాస్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్ కీలకపాత్రలు  పోషిస్తున్నారు.