రజనీకాంత్ జైలర్ సినిమాతో విలన్గా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు వినాయకన్ (Vinayakan). అయితే, ఈ నటుడు జైలర్ తర్వాత వరుస వివాదాల్లో చిక్కుకుని తన గుర్తింపును పూర్తిగా పోగొట్టుకుంటున్నారు. లేటెస్ట్గా తన అసభ్య ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెళితే..
మలయాళ నటుడు వినాయకన్ తన ఇంటి బాల్కనీ నుండి పొరుగు ఇంటివారితో గొడవ పడ్డారు. లుంగీ కట్టుకుని పక్కింటి వారితో అసభ్యకరంగా మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతుంది. పక్కింటి వారిపై ఇష్టానుసారంగా అరుస్తూ, బూతులు తిడుతూ దూకుడుగా ప్రవర్తిస్తున్న వినాయకన్.. ఇపుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాడు. అంతేకాదు అతను తన లుంగీని తీసివేసి అసభ్య ప్రవర్తనను కూడా ప్రదర్శించాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో వినాయకన్ వికృత చర్యలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. వినాయకన్ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో వీడియో స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తూ.. ' ఆయనను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని అంటున్నారు. 'ఇంత గలీజు పనులేంట్రా.. జైలర్ మూవీ విలన్ అరాచకాలు మామూలుగా లేవుగా' అని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
#Vinayakan 🥃🔞🙉
— Tharani ᖇᵗк (@iam_Tharani) January 20, 2025
Actor or Drunker 😡
He should be banned from acting.
pic.twitter.com/JK3UWJTzop
ఈ ‘విలన్’కు వివాదాలు కొత్తేమీ కాదు:
‘జైలర్’లో విలన్‌గా నటించిన వినాయకన్ కు వివాదాలు కొత్త కాదు. 2023 అక్టోబర్ నెలలో కేరళ పోలీసులు వినాయకన్ ను అరెస్టు చేశారు. ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో గొడవకు దిగాడు. నటుడు వినాయకన్ తమను ఇబ్బంది పెడుతున్నాడని, అపార్ట్‌మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకన్న పోలీసులు అక్కడికి చేరుకుని నటుడు వినాయకన్ ను ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్‌ను తరలించారు. అప్పుడు కూడా మద్యం మత్తులో ఉన్న వినాయకన్ కోపంతో ఊగిపోయాడు. తాము మర్యాదగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో పోలీసులు వినాయకన్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇటీవలే వినాయకన్ హైదరాబాద్ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో వినాయకన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.