11 నెలల దిగువకు తయారీ రంగం పనితీరు

11 నెలల దిగువకు తయారీ రంగం పనితీరు

న్యూఢిల్లీ: మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రొడక్షన్‌‌‌‌ కిందటి నెలలో తగ్గింది. ఈ సెక్టార్ పనితీరును కొలిచే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో 57.5 ఉంటే నవంబర్‌‌‌‌‌‌‌‌లో 56.5 కి పడింది. ఇది 11 నెలల కనిష్టం.   

అయినప్పటికీ  మాన్యుఫాక్చరింగ్ సెక్టార్  వృద్ధి బాటలోనే కొనసాగుతోంది. పీఎంఐ 50 కి పైన ఉంటే సంబంధిత సెక్టార్ విస్తరిస్తున్నట్టు. ఎగుమతి ఆర్డర్లు నాలుగు నెలల గరిష్టానికి చేరుకున్నాయని, కానీ రామెటీరియల్స్ ధరలు పెరగడంతో  ప్రొడక్షన్‌‌‌‌పై ఒత్తిడి నెలకొందని  హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌బీసీ చీఫ్ ఇండియాఎకనామిస్ట్‌‌‌‌  ప్రంజుల్‌‌‌‌ భండారి అన్నారు.