
తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందిన నటి అభినయ (Abhinaya). సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో మహేష్ బాబు చెల్లిగా నటించి తెలుగువారికి దగ్గరైంది.
బుధవారం (2025 ఏప్రిల్ 16న) అభినయ, వేగేశ్ కార్తీక్‌తో (సన్నీవర్మ) వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన చిరకాల మిత్రుడు, ప్రియుడు వేగేశ్ కార్తీక్‌తో మార్చి 9న నిశ్చితార్థం జరగగా.. ఏప్రిల్ 16న మూడు మూళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులతో పాటు పలువురు సినీ స్టార్స్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఈ క్రమంలో అభినయ పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు అభినయకు విషెష్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. పెళ్లి వేడుకలో భాగంగా మహెందీ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను, ఇప్పటికే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
నటి అభినయ.. మూగ, చెవుడు అయినప్పటికీ, సన్నివేశానికి తగ్గట్టుగా హావభావాలు పలికిస్తూ అద్భుతంగా రాణిస్తోంది. అంతేకాదు ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలు పెట్టిన అభినయ ఇప్పుడు హీరోయిన్గా కూడా నటిస్తోంది. ప్రతిభకి వైకల్యం అడ్డు కాదని నటి అభినయ నిరూపించింది.
అభినయ సినిమాల విషయానికి వస్తే.. రవితేజ నేనింతే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, జీనియస్, ధృవ, సీతా రామం, ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. ఇటీవల పని అనే మలయాళ చిత్రంలో నటించి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.