Abhinaya Photos: పెళ్లి ఫోటోలు పంచుకున్న నటి అభినయ.. చూడముచ్చటైన జోడంటూ నెటిజన్లు పోస్టులు

Abhinaya Photos: పెళ్లి ఫోటోలు పంచుకున్న నటి అభినయ.. చూడముచ్చటైన జోడంటూ నెటిజన్లు పోస్టులు

నటి అభినయ వివాహం బుధవారం  (2025 ఏప్రిల్ 16న)  అంగరంగ వైభవంగా జరిగింది. తన చిన్ననాటి స్నేహితుడైన వేగేశ్‌ కార్తీక్‌‌ను (సన్నీవర్మ) ఆమె  వివాహమాడింది. హైదరాబాద్‌‌లో జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

అయితే, తాజాగా అభినయ తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఈ పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫోటోలు చూసిన నెటిజన్లు అభినయకు విషెష్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. చూడముచ్చటగా ఉంది ఈ జంట అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా అభినయ పెళ్లి చేసుకున్న కార్తీక్ వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు సమాచారం.

‘శంభో శివ శంభో’సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అభినయ తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈమె పుట్టుకతోనే మూగ, చెవిటి అయినా తనదైన నటనతో అందర్నీ ఆకట్టుకుంటోంది.

అభినయ సినిమాల విషయానికి వస్తే.. రవితేజ నేనింతే సినిమాతో టాలీవుడ్‌ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కింగ్‌, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, జీనియస్, ధృవ, సీతా రామం, ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. ఇటీవల పని అనే మలయాళ చిత్రంలో నటించి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.