చెత్తపని చేసిన ఓ ప్రభుద్దిడికి దేహశుద్దు చేశారు హీరోయిన్ ఐశ్వర్య రఘుపతి. ఆమె తాజాగా నటించిన మూవీ కెప్టెన్ మిల్లర్. తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఆడియో లాంఛ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మేకర్స్. చెన్నైలో జరిగిన ఈ వేడుకకు ధనుష్ అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు.
అయితే, ఏఈ వేడుక ముగించుకొని తిరిగివెళ్తుండగా నటి ఐశ్వర్య రఘుపతితో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహించిన ఆమె ఆ యువకుడికి దేహశుద్ది చేసింది. అతని కాలర్ పట్టుకొని మరీ నాలుగు తగిలించింది. దీంతో తప్పు తెలుసుకున్న సదరు వ్యక్తి అక్కడి నుండి తప్పించుకోవాలని ప్రయత్నించగా అతన్ని వెంబడించి మరీ చితకొట్టేసింది. అనంతరం ఆ యువకుడు అక్కడినుండి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే నటి ఐశ్వర్య రఘుపతిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేయకూడదు.. ఈ మధ్య ఇలాంటి చిల్లరగాళ్ళు ఎక్కువైపోయారు, మీ ధైర్యానికి హాట్సాఫ్ మేడం.. వాడికి ఇంకో నాలుగు తగిలించాల్సింది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
— Christopher Kanagaraj (@Chrissuccess) January 3, 2024
ఇక కెప్టెన్ మిల్లర్ సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ తెరెకక్కిస్తున్న ఈ మూవీలో ప్రియాంక మొహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ. టీజర్, సాంగ్స్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.