
'ఉయర్తిరు 420' మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అక్షర గౌడ (Akshara Gowda). తక్కువ టైంలోనే కోలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్లో ఈ అమ్మడు చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి.
అందాల ఆరబోతలో టాలీవుడ్ లోనూ అడుగుపెట్టిన ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు కూడా రాలేదు. తెలుగులో ఈ అమ్మడు చేసిన మన్మథుడు 2, ది వారియర్ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ దాస్ కా రమ్మీ చిత్రంలో విశ్వక్ సేన్ తో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
Also Read :- 90's బయోపిక్ తరహాలో ఓటీటీకి మరో తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్
అక్షర చివరగా గతేడాది హరోం హరం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది బాక్సా పీస్ వద్ద ఆడలేదు. దాంతో టాలీవుడ్ లో ఈ అమ్మడికి కొత్త సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, తాజాగా బ్యూటీ అక్షర గౌడ షేర్ చేసిన పిక్స్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. స్టైలిష్ ఫోజ్ ఇచ్చి నదుము అందాన్ని చూపిస్తూ డిజైనర్ నెక్లెస్ను ధరించిన అక్షర.. కుర్రకారును చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఇంత గ్లామర్గా ఉన్నా సరిగ్గా ఆఫర్లు దక్కడం లేదంటూ నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు అయినా ఈ అమ్మడికి మంచి ఆఫర్లు దక్కేనా అనేది చూడాలి.