చిన్న సినిమాకు పెద్ద రెస్పాన్స్: ‘పొట్టేల్’ రెస్పాన్స్పై అనన్య

చిన్న సినిమాకు పెద్ద రెస్పాన్స్: ‘పొట్టేల్’ రెస్పాన్స్పై అనన్య

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా సాహిత్ మోత్కూరి  దర్శకత్వంలో  నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె నిర్మించిన చిత్రం ‘పొట్టేల్’.  శుక్రవారం విడుదలైన సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని తెలియజేసింది టీమ్. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో యువ చంద్ర కృష్ణ మాట్లాడుతూ ‘నేను కొత్త యాక్టర్‌‌‌‌లా కాకుండా, అనుభవం ఉన్న నటుడిగా నటించాననే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఇంత మెమొరబుల్ క్యారెక్టర్ ఇచ్చిన సాహిత్‌‌కి థాంక్ యూ. మాస్  క్లాస్ అనే తేడా లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు’ అని చెప్పాడు.

అనన్య మాట్లాడుతూ ‘మేము ఊహించిన దాని కంటే చాలా గొప్ప స్పందన లభిస్తోంది.  ఒక చిన్న సినిమాకి ఈ మధ్య కాలంలో ఇంత మంచి రెస్పాన్స్ రాలేదు’ అని చెప్పింది.  డైరెక్టర్ సాహిత్  మాట్లాడుతూ ‘హానెస్ట్‌‌ సినిమా అంటూ 80 శాతం రివ్యూలు పాజిటివ్‌‌గా వచ్చాయి.  ప్రతి థియేటర్‌‌‌‌లో  స్టాండింగ్ ఒవేషన్ వస్తోంది’ అని చెప్పాడు. సినిమా  చూసిన ప్రతి ఒక్కరూ మెస్మరైజింగ్ రెస్పాన్స్ ఇస్తున్నారని నిర్మాత సురేష్​ అన్నారు. నటులు నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్ పాల్గొన్నారు.