ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 పై హైప్ రోజురోజుకూ మరింత పెరుగుతూ వస్తోంది. ఇండియన్ బిగ్గెస్ట్ రిలీజ్ సినిమాగా రిలీజ్ కాబోతుందంటూ ఓ వైపు మార్మోగుతూనే.. మరోవైపు పుష్ప3 కూడా ఉంటుందంటూ మేకర్స్ చెబుతూ వస్తున్నారు. అంతేకాదు.. పుష్ప2 ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. వెయ్యి కోట్ల పైమాటే అని కూడా వినిపిస్తోంది.
ఈ క్రమంలో పుష్ప2 పై ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది నటి,యాంకర్ అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj). తెలుగు బిగ్‍బాస్ దీపావళి స్పెషల్ ఎపిసోడ్‍కు గెస్టుగా వచ్చిన ఆమె పుష్ప 2 గురించి మాట్లాడారు. ఆ వివరాలు ఇవే..
బిగ్‍బాస్ హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ.. "నీ ప్రయాణం ఎక్కడ్నుంచో ఎక్కడికెళ్లిందో షాక్ గా ఉందంటూ.. 'ఇప్పుడేమో విలన్ అయ్యావ్, పుష్ప అని బెదిరిస్తున్నావ్.. ఇక మా బిగ్‍బాస్ ఆడియన్స్ తో పుష్పకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకోవొచ్చుని అనసూయతో నాగార్జున అన్నారు. ఇక 'వెనుక ఉంటానంటే చెప్పేస్తానంటూ అనసూయ సరదాగా అన్నారు. తాను ఎక్కడికి వెళ్లానని నాగ్ అన్నారు.
Also Read:-కావాలంటే మీరు నన్ను గిచ్చి చూడొచ్చు..
'పుష్ప 2 సినిమాలో 10 నిమిషాలకు ఓ హై ఇచ్చే మూవ్‍మెంట్ ఉంటుందని.. ఫస్ట్ పార్ట్ కంటే పుష్ప 2: ది రూల్‍లో అసలు కథ ఉంటుందని' అనసూయ తెలిపారు. అలాగే 10 నిమిషాల తర్వాత క్లైమాక్స్‌లా ఉంది అదేంటి అనిపిస్తుంది.. కానీ లేదు. ఈ పార్ట్‌లో మరింత డెప్త్ ఉంటుంది. పుష్ప: ది రైజ్ దాదాపు ఇంట్రడక్షన్. అసలు కథ ఇప్పుడు ఉంటుంది” అని అనసూయ బిగ్‍బాస్ షో ద్వారా వెల్లడించారు. దాంతో ఐకాన్ ఫ్యాన్స్ ఊహలకు హద్దులేవ్ అనేలా ఖుషి అవుతున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప సినిమాలో అనసూయ 'దాక్షాయనీ' అనే మాస్ నెగెటివ్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇక పుష్ప 2 లో కూడా ఆమె పాత్ర మరింత డెప్త్ గా ఉంటుందని సమాచారం.