Bahishkarana Review: బ‌హిష్క‌ర‌ణ వెబ్ సిరీస్ రివ్యూ - అంజ‌లి వేశ్య‌గా న‌టించిన బోల్డ్ క్రైమ్ ఎలా ఉందంటే?

Bahishkarana Review: బ‌హిష్క‌ర‌ణ వెబ్ సిరీస్ రివ్యూ - అంజ‌లి వేశ్య‌గా న‌టించిన బోల్డ్ క్రైమ్ ఎలా ఉందంటే?

హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా చేస్తూనే పలు చిత్రాల్లో ఇంపార్టెంట్ రోల్స్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకుంటుంది అంజలి(Anjali). తాజాగా ఆమె ఫిమేల్ లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్లో వేశ్యగా నటించిన వెబ్ సిరీస్ ‘బహిష్కరణ' (Bahishkarana). ఈ వెబ్ సిరీస్ శుక్రవారం జులై 19న జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేమ,మోసం,ప్రతీకారంతో ఉత్కంఠగా సాగే సన్నివేశాలతో ఈ సిరీస్ ఉందంటూ ఆడియన్స్ నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

ముఖేష్ ప్రజాపతి డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో ప్రశాంతి మలిశెట్టి  నిర్మించిన ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ విలేజ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కింది.ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉంటాయని ఇప్పటికే దర్శక నిర్మాతలు ప్రకటించారు.ఇందులో పుష్ప అనే వేశ్య పాత్రలో అంజలి కనిపిస్తోంది. ఈ సిరీస్ లో రవీంద్ర విజయ్,శ్రీతేజ్,అనన్య నాగళ్ల,షణ్ముక్,చైతన్య సాగిరాజు,మహ్మద్ బాషా,బేబీ చైత్ర ఇతర పాత్రల్లో కనిపించి మెప్పించారు. 

మొత్తం ఆరు ఎపిసోడ్స్‌తో ద‌ర్శ‌కుడు ఈ సిరీస్‌ను తెర‌కెక్కించాడు. ద‌ర్శి, ల‌క్ష్మితో పాటు సిరి పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేస్తూ ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో సిరీస్ మొద‌ల‌వ్వగా..ఆ త‌ర్వాత శివ‌య్య‌పై ద‌ర్శి ప‌గ‌తో ర‌గిలిపోతున్న‌ట్లుగా చూపించి ఆడియన్స్ లో ఆస‌క్తిని రేకెత్తించారు. ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో ఫ‌స్ట్ ఎపిసోడ్‌ను ముగించిన ద‌ర్శ‌కుడు సెకండ్ ఎపిసోడ్ నుంచి మొత్తం ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ చూపించారు. 

బహిష్కరణ కథేంటంటే: 

బహిష్కరణ సిరీస్ 1990ల గుంటూరు రూరల్ రివేంజ్ డ్రామాగా రాబోతుంది. గుంటూరు జిల్లాలోని పెద్ద‌ప‌ల్లికి చెందిన శివ‌య్య (ర‌వీంద్ర విజ‌య్‌) 25 ఏళ్లుగా ప్రెసిడెంట్‌గా ప‌నిచేస్తుంటాడు. ఓ రహస్యమైన గతం ఉన్న పుష్ప అనే వేశ్య, శివ‌య్యకు ఉంపుడుగ‌త్తెగా ఉంటుంది. ఇక శివ‌య్య ద‌గ్గ‌ర ప‌నిచేసే ద‌ర్శి (శ్రీతేజ్‌) పుష్ప‌ను గాఢంగా ప్రేమిస్తాడు. పుష్ప కూడా ద‌ర్శితో క‌లిసి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని  డిసైడ్ అవుతుంది.ఈ విషయం గమనించిన శివయ్య దర్శి చూస్తుండగానే లక్ష్మీ (అనన్య నాగళ్ల) తో పెళ్లి అయ్యేలా చేస్తాడు.

దీంతో చాలా ప్రాణంగా ప్రేమించిన పుష్ప ఒక్కసారిగా దూరం కావ‌డంతో  మందుకు ఆడిక్ట్ అవుతాడు. ఇక వీరి దర్శి, పుష్ప ల మధ్య ఉన్న సంబంధాన్ని గ్రహించిన లక్ష్మీ..ఎలాగైనా తన ప్రేమ‌తో భ‌ర్త‌ను దారిలోకి తెచ్చుకుంటుంది.ఇక వారి కాపురం హ్యాపీ గా సాగే టైంలోనే   ద‌ర్శి ఓ రేప్ క‌మ్‌ మ‌ర్డ‌ర్ కేసులో జైలు పాల‌వుతాడు? మరి ఇలాంటి రేప్ కేసు లో దర్శి ఎలా ఇరుక్కున్నాడు? ఎవరి ఎరికించారు? అలాగే శివ‌య్య తోట‌లో ఉన్న గులాబీ మొక్క‌ల క‌థేమిటి? శివ‌య్య‌ చేసిన మోసాలకు పుష్ప ఎలా రివేంజ్ తీర్చుకుంది?దర్శి బయట ఎలా పడ్డాడు? అన్న‌దే ఈ వెబ్‌సిరీస్ క‌థ.