తమిళ పరిశ్రమ నుంచి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కొత్త బ్యూటీ అనుకృతి వాస్( Anukreethy Vas). పేరుకు తగ్గట్టే విభిన్నమైన పాత్రలతో ఈ భామ ఆకట్టుకుంటోంది. 2018లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుని సినీ పరిశ్రమ దృష్టిని తన వైపుకు తిప్పుకుంది.
తొలి సినిమానే విజయ్‌సేతుపతి వంటి స్టార్ హీరోతో డిఎస్పి (DSP) మూవీలో చాన్స్ కొట్టేసింది. ఇప్పుడు తెలుగులో ‘టైగర్ నాగేశ్వర్రావు’తో సందడి చేస్తోంది. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్‌గా నటించగా..అనుకృతి కీలక రోల్లో కనిపించింది.
ALSO READ :-వలసల వనపర్తిని వరిపంటల వనపర్తి చేశాం : కేసీఆర్
జయవాణిగా చీరకట్టులో అదరగొట్టింది. ఈ సినిమాలో తన రోల్‌కి మంచి రెస్పాన్స్ వస్తోందని ఈ బ్యూటీ సంతోషం వ్యక్తం చేస్తోంది. చాలెంజింగ్ పాత్రల్లో నటించడమే తనకు కిక్ అని అంటోంది.
అనుకృతి వాస్ ఎవరనేది.. సినిమాల్లో పెద్దగా పరిచయం లేకున్న..గ్లామర్ ప్రపంచానికి తను ఎవరో తెలుసు. 25 ఏళ్ల వయస్సులోనే 2018 మిస్ ఇండియాగా కిరీటాన్ని సొంతం చేసుకుంది. అను టాప్ 30 సెమీ ఫైనలిస్ట్‌లలో స్థానం సంపాదించింది. ఇక తెలుగు ఇండస్ట్రీలో తనదైన టాలెంట్ను చూపించడానికి సిద్ధపడ్డ అనుకృతికి..ఈ డెంజరస్ జయవాణి క్యారెక్టర్ ఎలాంటి కెరీర్ ఇస్తుందో చూడాలి మరి.