స్టార్ హీరో కొడుకుతో డేటింగ్!

స్టార్ హీరో కొడుకుతో డేటింగ్!

‘అ ఆ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళీ అమ్మాయి  అనుపమ పరమేశ్వరన్.. అనతి కాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుని యూత్ ఆడియెన్స్‌‌ను అట్రాక్ట్ చేసింది. హీరోయిన్‌‌గా నటిస్తూనే, ఫిమేల్ లీడ్‌‌గానూ వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె ఓ స్టార్ హీరో  కొడుకుతో ప్రేమాయణం సాగిస్తున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళ స్టార్ విక్రమ్ కొడుకు ధృవ్‌‌తో అనుపమ ప్రేమలో ఉందని   తెలుస్తోంది. 

వీరిద్దరు ముద్దు పెట్టుకున్న ఫొటో ఒకటి  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో  వీరు డేటింగ్‌‌లో ఉన్నార‌‌ని, త్వర‌‌లోనే పెళ్లిచేసుకుంటార‌‌నే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు  ధ్రువ్‌‌ విక్రమ్, అనుప‌‌మ‌‌ పరమేశ్వరన్ జంటగా  ‘బైస‌‌న్’ అనే మూవీలో న‌‌టిస్తున్నారు. మారి సెల్వరాజ్ ద‌‌ర్శక‌‌త్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  

ఇందులో ధ్రువ్ క‌‌బ‌‌డ్డీ ప్లేయ‌‌ర్‌‌గా క‌‌నిపించ‌‌నుండ‌‌గా, అత‌‌డి ప్రేయ‌‌సిగా అనుప‌‌మ క‌‌నిపించ‌‌నుంద‌‌ని తెలుస్తోంది. అయితే  ప్రస్తుతం వైర‌‌ల్‌‌గా మారిన  ఫొటో ఈ సినిమాలో అయి ఉంటుంద‌‌ని కొంద‌‌రు కామెంట్లు చేస్తున్నారు. అలాగే  అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌‌లో ‘సినిమా బండి’ ఫేమ్  ప్రవీణ్ కండ్రేగుల రూపొందిస్తున్న ‘పరదా’ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.