Actress Ashi Roy: అది రేవ్ పార్టీ కాదు! బర్త్‌డే పార్టీ-ప్లీజ్‌ నాకు సపోర్ట్ చేయండి..ఆషీరాయ్ సరికొత్త ట్విస్ట్.

బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీ..ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. ఆ పార్టీలో పలువులు టాలీవుడ్ నటినటులు పాల్గొన్నారనే వార్తలు కూడా కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు,వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ రేవ్‌పార్టీపై నటి ఆషీరాయ్ (Ashi Roy) షాకింగ్ కామెంట్స్ చేసింది. అది రేవ్ పార్టీ కాదని.. బర్త్ డే పార్టీ అని చెప్పుకొచ్చింది. వాసు అన్నయ్య పిలిస్తేనే.. అది బర్త్ డే పార్టీ అనుకుని వెళ్లానని తెలిపింది. లోపల ఏం జరుగుతుందో తనకు తెలియదంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. తాను ఒక ఆడపిల్లనని గుర్తించి అందరూ సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేసింది.

కాగా బెంగళూరు నగర శివార్లలో జరిగిన ఈ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీకి హాజరైన వారిలో ప్రధానంగా హేమా, శ్రీకాంత్ ల పేర్లు వినిపించగా..దానిపై వారు క్లారిటీ ఇచ్చారు. వీడియోలు విడుదల చేస్తూ..తాము పార్టీలో లేమని తెలిపారు.

అయితే ఈ పార్టీకి మొత్తం 101 మంది హాజరైనట్లు బెంగళూరు సీపీ తెలిపారు.ఇప్పటివరకు నిర్వాహకులతో పాటు డ్రగ్స్‌ తీసుకున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. పట్టుబడినవారిలో చాలామంది హైదరాబాద్ వారే ఉన్నారని చెప్పారు. ఈ పార్టీలో 15 గ్రాముల HMDA, 6 గ్రాముల కొకైన్, 6 గ్రాముల హైడ్రో గంజా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.ఒక్క రోజుకు దాదాపు రూ.50 లక్షలు ఖర్చు చేశారని వెల్లడించారు. ఈ పార్టీలో పాల్గొన్న అందరి నుంచి రక్త నమూనాలను సేకరించామని..రిపోర్టులు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు.