’మిస్టర్ బచ్చన్‘ అట్టర్ ఫ్లాప్ అయినా హీరోయిన్ భాగ్యశ్రీ పంట పండింది..!

’మిస్టర్ బచ్చన్‘ అట్టర్ ఫ్లాప్ అయినా హీరోయిన్ భాగ్యశ్రీ పంట పండింది..!

గతేడాది ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే.. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది.  ఫస్ట్ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా.. తనదైన గ్లామర్‌‌‌‌తో అందర్నీ ఆకట్టుకుంది భాగ్యశ్రీ. దీంతో ఆమె బ్యాక్ టు బ్యాక్ బంపర్ ఆఫర్స్ అందుకుంటోంది. ఇప్పటికే రామ్‌‌తో ఓ మూవీ, దుల్కర్ సల్మాన్‌‌కు జంటగా ‘కాంత’ సినిమాలో నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండతో ‘కింగ్‌‌డమ్‌‌’ చేస్తోంది. వీటితోపాటు సూర్యకు జోడీగా ఓ తమిళ మూవీలోనూ సెలెక్ట్ అయ్యిందని సమాచారం. తాజాగా మరో లక్కీ చాన్స్ అందుకుందట భాగ్యశ్రీ బోర్సే. అదికూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో సరసన కావడంతో ఓవర్‌‌‌‌నైట్ భాగ్యశ్రీ ఇమేజ్ మరింత పెరిగిపోయింది. 

హనుమాన్’  ఫేమ్ ప్రశాంత్ వర్మ  డైరెక్షన్ లో ప్రభాస్  ‘బ్రహ్మ రాక్షస’  సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్‌‌కు జంటగా భాగ్యశ్రీని సెలెక్ట్ చేశారట.  ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. ప్రభాస్‌‌తో ‘సలార్’ చిత్రం నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ దీన్ని నిర్మించనుంది. అయితే ప్రభాస్‌‌ చేతిలో ఇప్పటికే ఐదారు భారీ ప్రాజెక్టులు ఉండటంతో ఈ క్రేజీ కాంబో ఎప్పుడు ప్రారంభమవుతుందనేది తెలియాల్సి ఉంది.