Bhagyashri Borse: స్టేజీపై డ్యాన్స్‌ ఇరగదీసిన భాగ్యశ్రీ..నల్లంచు తెల్లచీరతో ఫ్యాన్స్ ఫిదా

భాగ్యశ్రీ బోర్సే.. రవితేజ హీరోగా హరీష్ శంకర్ రూపొందిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో ఆమె ప్రెజెంటేషన్ చాలా ఫ్రెష్‌‌‌‌‌‌‌‌గా ఉంటుందని తెలుస్తోంది.ఇటీవల విడుదలైన రెప్పల్ డప్పుల్, సితారా సాంగ్స్తో ప్రూవ్ అయింది. 

లేటెస్ట్గా కర్నూలులో సోమవారం రాత్రి (ఆగస్ట్ 12న) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌లో హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సే స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. తనదైన లుక్‌‌‌‌‌‌‌‌లో, ‘నల్లంచు తెల్లచీర’ అనే సాంగ్‌కు బోర్సే డాన్స్ ఇరగదీశారు. ఈ అదిరిపోయే పెర్ఫార్మన్స్తో బచ్చన్ రిలీజ్కి ముందే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది భాగ్యశ్రీ.

అలాగే తాను నార్త్ అమ్మాయి అయినప్పటికీ తెలుగు భాషని అర్ధం చేసుకోని ప్రతి డైలాగ్‌ని తన మాతృభాషకి ట్రాన్స్‌లేట్ చేసుకొని మిస్టర్ బచ్చన్కి డబ్బింగ్ చెప్పడం గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఇక ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు చూసుకుంటే ఇటీవలే వచ్చిన హిందీ సినిమా ‘చందు ఛాంపియన్’లో నటించారు. అంతకుముందు యారియాన్ 2లో నటించారు.ఇదిలా ఉంటే తను నటించిన మొదటి తెలుగు సినిమా విడుదల కాకముందే భాగ్యశ్రీకి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఆల్రెడీ ఆమె మూడు తెలుగు సినిమాల్లో చాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. 

మిస్టర్ బచ్చన్ లో జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పనోరమా స్టూడియోస్,టి సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఆగష్టు 15న ఈ సినిమా విడుదల కానుంది.