
కోలీవుడ్ హీరోయిన్ భావన గురించి వారం రోజులుగా ఇంటర్నెట్ లో పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా నటి భావన తన భర్తతో మనస్పర్థలు, విభేదాలు కారణంగా సీక్రెట్ గా విడాకులు తీసుకున్నారని ఈ కారణంగానే సోషల్ మీడియాలో తన భర్తతో దిగిజా ఫోటోలు, వీడియోలు వంటివి డిలీట్ చేసేసిందని పలు రూమర్లు, గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీంతో నటి భావన తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు వినిపిస్తున్న వార్తలపై స్పందించింది.
ఇందులో భాగంగా నిజానిజాలు తెలుసుకోకుండా తన పర్సనల్ లైఫ్ గురించి ఫేక్ వార్తలు ప్రచారం చెయ్యద్దని హెచ్చరించింది. అలాగే తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు వినిపిస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేద్దని కాబట్టి అలాంటి ఫేక్ న్యూస్ ని నమ్మద్దని క్లారిటీ ఇచ్చింది. ఇక తానంటే గిట్టని కొందరు తన పర్సనల్ లైఫ్ గురించి ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది.
సోషల్ మీడియాలో ఫోటోల గురించి స్పందిస్తూ జనరల్ గా తాను తన ఫ్యామిలీ ఫోటోలు, పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చెయ్యనని ఈ మధ్య కొందరు ఈ ఫోటోలతో నేరాలకు పాల్పడుతున్నారని అందుకే తన పరసనల్ లైఫ్ ని సోషల్ మీడియాకి దూరంగా వుంచుతాని పేర్కొంది. దీంతో నటి భావన విడాకుల రూమర్స్ కి పులిస్టాప్ పడింది.
ఐతే నటి భావన 2018లో కన్నడ ఫిలిం ప్రొడ్యూసర్ నవీన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాల పరంగా జోరు తగ్గించింది. నటి భావన తెలుగులో నటించిన ఒంటరి, మహాత్మ, సినిమాలో నటించి అలరించింది. చివరగా 2012లో మాస్ మహారాజ్ రవితేజ నటించిన నిప్పు సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో కనిపించింది. ఆ తర్వాత మాలీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. కానీ కన్నడ, మలయాళం, తమిళ్ తదితర భాషల్లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ అలరిస్తోంది.