
షార్ట్ ఫిలింస్‌తో కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది చాందిని చౌదరి. చేసింది తక్కువ ప్రాజెక్టులే అయినా డిఫరెంట్ కాన్సెప్టులను సెలెక్ట్ చేసుకుంటోంది. రీసెంట్ గా ‘గామి’ చిత్రంతో ప్రేక్షకుల మందుకొచ్చేందుకు రెడీ అవుతున్న చాందిని చేతికి మరో మూవీ వచ్చింది. ప్రకాష్ దంతులూరి దర్శత్వంలో తెరకెక్కుతోన్న ‘యేవమ్’ చిత్రలో చాందిని కీ రోల్ ప్లే చేస్తోంది.
చాందిని చౌదరి, వశిష్ఠ సింహ, ఆషు రెడ్డి, భరత్ రాజ్ ప్రధాన పాత్రలలో డైరెక్టర్ ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న యేవమ్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. నటుడు నవదీప్ సీ స్పేస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. నీలేష్ మండాలపు, కీర్తన శేష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
టీజర్ విషయానికి వస్తే..క్రైమ్,ఇన్వెస్టిగేషన్ సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన టీజర్ ఆకట్టుకుంటోంది. ఒకరి మీద శృతిమించిన వ్యామోహం ఎన్ని ఘోరాలైన చేయిస్తుంది అనే ఎలిమెంట్ తీసుకొని యేవమ్ ని తెరకెక్కించినట్లు టీజర్ బట్టి అర్ధమవుతోంది.
యేవమ్ చిత్రంలో చాందిని చౌదరి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. పోలీస్ జాబ్ సంపాదించి కొత్తగా ఏఎస్సైగా డ్యూటీలో జాయిన్ అయిన చాందిని చౌదరి స్థానికంగా జరిగే హత్యల మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది.ఈ మూవీలో చాందినీ ఏఎస్సైగా నటిస్తుంది. అనంతరం విలేజ్ లో జరిగే వరుస హత్యలు..వాటిపై చాందిని చౌదరి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది.
ఇక అంతలోనే గంగాధర్ అనే పేరుతో ఆమెకి ఫోన్ వచ్చి ఆ హత్యలన్నీ చేసింది నేనే అని ఓ అజ్ఞాత వ్యక్తి చెబుతాడు. అతన్ని పట్టుకోవడానికి చాందిని చౌదరి వెళ్తుంది. ఆమెని కనిపించకుండా మోహించే వ్యక్తిగా నటుడు వశిష్ట సింహ కనిపిస్తున్నాడు. మరి టీజర్ తోనే అలరించిన చాందినీ..రిలీజ్ అయ్యాక ఎలాంటి ఫేమ్ వస్తుందో చూడాలి.