
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం 400 ఎకరాల భూమిని వేలం వేయకుండా అటవీ సంపదను, జీవరాశులను కాపాడాలని హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తు్న్నారు. విద్యార్థుల ఆందోళనకు ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలపడంతో గచ్చిబౌలి భూముల ఇష్యూ నేషనల్ వైడ్‌గా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిర్ణయంతో లక్షల సంఖ్యలో చెట్ల నేలకొరుగుతున్నాయని.. జీవరాశులు చనిపోతున్నాయని.. అందుకు సంబంధించిన వీడియోలను విద్యార్థులు, రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
బాలీవుడ్ నటి దియా మీర్జా కూడా గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ప్రకృతిని పరిరక్షించండి, జీవవైవిధ్యాన్ని కాపాడాలంటూ విద్యార్థుల నిరసనలు, చెట్ల నరికివేత, జంతువుల వధకు సంబంధించిన వీడియోలను ఆమె షేర్ చేశారు. ఇదిలా ఉంటే.. గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి సోషల్ మీడియాలో ఏఐతో క్రియేట్ చేసిన ఫేక్ వీడియోలు షేర్ చేస్తున్నారని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు సినీ, రాజీకయ ప్రముఖులు సోషల్ మీడియాలో ఏఐతో తయారు చేసిన వీడియోలు సర్య్కూలేట్ చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నటి దియా మీర్జా కౌంటర్ ఇచ్చారు.
►ALSO READ | ఏడు అడుగుల కండక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
‘‘400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూ ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో ముఖ్యమైనది ఏఐతో క్రియేట్ చేసిన వీడియోలు షేర్ చేశారని. కానీ గచ్చిబౌలి ఇష్యూకి సంబంధించి నేను పోస్ట్ చేసిన వీడియోలు పూర్తిగా ఒరిజినల్‌వి. వాటిలో ఏ ఒక్కటి కూడా ఏఐతో రూపొందించినవి కావు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి. మీడియా, తెలంగాణ ప్రభుత్వం అలాంటి వాదనలు చేసే ముందు వాస్తవాలను ధృవీకరించుకోవాలి’’ అని దియా మీర్జా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నటి దియా మీర్జా అదే రేంజ్లో కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.