‘పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ చిత్రంతో దిశా పటానీ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ దిశాపటానీ(Disha Patani). తన కెరీర్ లో తొలిచిత్రం కూడా ఇదే. టాలీవుడ్ ఎంట్రీ తర్వాత బాలీవుడ్ లో వరుస ఆఫర్లు సొంతం చేసుకుని.. బిజీయెస్ట్ హీరోయిన్గా మారింది.
లేటెస్ట్ విషయానికి వస్తే.. హీరోయిన్ దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీ (Jagdish Singh Patani) మోసగాళ్ల చేతిలో మోసపోయాడు. యూపీలో రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయిన జగదీష్ సింగ్ పటానీకి ప్రభుత్వ కమిషన్‌లో ఉన్నత పదవి ఇప్పిస్తామని కొందరు కేటుగాళ్లు ఆయన నుంచి 25 లక్షలు కాజేసారు. దీంతో దిశా పటానీ తండ్రి జగదీశ్ పోలీసుల్ని ఆశ్రయించడంతో అసలు విషయం బయటికి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన జగదీష్ పటానీ అనే వ్యక్తి తనకు తెలిసిన కామన్ ఫ్రెండ్ ద్వారా.. శివేంద్ర ప్రతాప్ సింగ్ దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాష్ అనే ఇద్దరు వ్యక్తులు పరిచమయ్యారు. నిందితులు తమకు బలమైన రాజకీయ సంబంధాలు ఉన్నాయని మరియు ప్రభుత్వ కమిషన్‌లో చైర్మన్, వైస్ చైర్మన్ లేదా మరొక ప్రతిష్టాత్మక పదవిని పటానీకి వచ్చేలా హామీ ఇచ్చి జగదీష్ ని మభ్యపెట్టారు. ఇక పటాని నమ్మకాన్ని వారు సంపాదించిన తర్వాత.. ఈ మోసగాళ్ల బృందం అతని నుండి రూ. 25 లక్షలు కాజేశారు. దీంతో పోలీసుల్ని ఆశ్రయయించి జగదీష్ పటానీ కేసు నమోదు చేసారు.
దాంతో పోలీసులు ఆశ్రయించిన జగదీశ్ చెబుతూ.. అందులో రూ. 5 లక్షల నగదు, రూ. 20 లక్షలను మూడు వేర్వేరు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడం ద్వారా తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. వీరికి డబ్బులిచ్చి మూడు నెలలు అవుతున్నా వారినుండి ఎలాంటి పోస్ట్ రాలేదని.. దీంతో మోసపోయానని గ్రహించి వారిని నిలదీసినట్లు చెప్పుకొచ్చారు.
ALSO READ : ముదిరిన అమరన్ సినిమా వివాదం.. తమిళనాడులో థియేటర్‌పై పెట్రోల్ బాంబు: ఎందుకంటే?
అయితే, వారు వెంటనే ఇచ్చిన డబ్బు తిరిగిచ్చేస్తామన్నారని.. కానీ ఎన్నిసార్లు అడిగినా ఒకటే సమాధానం వస్తుండటంతో.. వారు మోసగాళ్ళని గుర్తించినట్లు చెప్పారు. అలాగే వారు డబ్బు ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులకు పూర్తి వివరాల్ని వెల్లడించారు. ప్రస్తుతం నిందితులిద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని వెతికే పనిలో ఉన్నారు.ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక ఈ విషయం బయటికి రావడంతో.. పోలీసు అయ్యుండి సైబర్ నేరగాళ్ళని ఎలా గుర్తించలేకపోయారని నెటిజన్లు కామెంట్స్ చేస్తునాన్రు. అలాగే కూతురు దిశా పటాని ప్రస్తుతం టాప్ మూవీస్ లో ఉండగా.. రిటైర్డ్ అయ్యాక కూడా పదవిని ఎందుకు ఆశించి మోసపోయారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అయినా ఇది సైబర్ మోసం అనే దాన్ని కన్నా.. మోసపోయాడని చెప్పొచ్చు అంటున్నారు నెటిజన్స్.
Actress #DishaPatani's Father Gets Duped Of ₹25 Lakh In Government Job Scam, FIR Filed#DishaPaatni's father #JagdishPatani was promised a position as chairman, vice-chairman, or a similar prestigious post in a government commission pic.twitter.com/KaTHI5JXTj
— Bollywood Buzz (@BollyTellyBuzz) November 16, 2024