KhushbooPatani: తప్పిపోయిన బిడ్డను రక్షించిన దిశా పటాని సోదరి.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

KhushbooPatani: తప్పిపోయిన బిడ్డను రక్షించిన దిశా పటాని సోదరి.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ (Khushboo Patani) చేసిన మంచిపనికి అందరు శభాష్ అంటున్నారు. తన ఇంటిపక్కనే ఉన్న ఓ పాడుబడ్డ బంగ్లాలో ఓ పాప తప్పిపోయి కనిపించింది. ఆ పాపను రక్షించి, ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ చేయించింది. ఆ తర్వాత పోలీసులకి అప్పగించి, ఆ పాపను తన తల్లి చెంతకి చేరేలా తోడ్పడింది. అసలు ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఖుష్బూ పటానీ ఆదివారం (ఏప్రిల్ 21న) ఒక వీడియోను షేర్ చేశారు. అందులో ఆమె బరేలీలోని తన ఇంటి వెనుక ఒక పాడుబడ్డ ఇంట్లో మట్టిలో పడి ఉన్న ఆడపిల్లను రక్షించే వీడియోను షేర్ చేశారు. అయితే, ఆ వీడియోలో ఈ పాపను వదిలేసిన తల్లి తండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఆ అమ్మాయిని ఓదార్చడానికి ప్రయత్నించి, ఆపై ఆమెను బయటకు తీసుకెళ్లింది.

ఆ వీడియోలో ఖుష్బూ, 'ఆ చిన్నారిని ఎవరో తమ ఇంటి వెనుక వదిలి వెళ్లారని, ఆమె అక్కడ మట్టిలో పడి ఉందని తెలియజేసింది. ఖుష్బూ, ఆమె తల్లి కలిసి ఆ పాపను ఇంటికి తీసుకెళ్లి, ఆహారం తినిపించారు. ఆపై చికిత్స కూడా చేయించారు. ఆ తర్వాత ఆ పాపను పోలీసులకు అప్పగిస్తూ 'ఆ అమ్మాయికి మంచి పెంపకం, తగిన ఇల్లు ఏర్పాటు చేస్తానని, ఆమె తన అనుచరులకు హామీ ఇచ్చింది. 

ఇలా ఇది జరిగిన సరిగ్గా రెండు గంటల తర్వాత ఖుష్బూ పటానీ మరో వీడియో రిలీజ్ చేస్తూ అప్డేట్ ఇచ్చింది. ఆ పాప తల్లిదండ్రుల వివరాలు తెలిశాయి. ఆ పాపను తల్లి తీసుకెళ్లారని తెలిపారు. ప్రయాణంలో ఉండగా తమ పాపను ఎవరో ఎత్తుకెళ్లారని తల్లి చెప్పి ఎమోషనల్ అయినట్లు వెల్లడించారు.

ఖుష్బూ చేసిన సహకారంతో ఒక చిన్నపాప మళ్లీ తల్లి చెంతకు చేరడం పట్ల అభినందనలు కురిపిస్తున్నారు. ఖుష్బూ ధైర్య, నిస్వార్థ ప్రవర్తన పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెడుతున్నారు. నీలాంటి వారే ఈ దేశానికి కావాల్సిందని, నువ్వు చూపిన తెగువ ఎంతో మందికి ఆదర్శం.. రియల్ హీరో అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

సోషల్ మీడియాలో వస్తోన్న ప్రశంసలకు ఖుష్బూ స్పందించింది. "ఒక మాజీ భారత ఆర్మీ మేజర్‌గా, నేను కేవలం 11 సంవత్సరాలలో వివిధ జీవిత పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఇందులో భాగంగా వేలాది మందిని కలిశాను. చాలా ప్రదేశాలలో నివసించడం మరియు చాలా అనుభవించడం నా జ్ఞానాన్ని తెచ్చిపెట్టింది.  అలా ఒక సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా మార్చింది" అని ఆమె తన బ్లాగులో రాసింది.