బాక్సర్‌గా బరిలోకి దిగుతున్న తెలుగమ్మాయి

అచ్చ తెలుగమ్మాయి ఈషా రెబ్బా కెరీర్‌‌ మెల్లగా స్పీడందుకుంటోంది. ఇప్పుడిప్పుడే ఆమెలోని యాక్టస్రెని శాటిస్‌ఫై చేసే రోల్స్ దొరుకుతున్నాయి. ఓ ఫేమస్ హీరో సినిమాలో ఒక ఇంపార్టెంట్ పాత్రలో కనిపించనుందట ఈషా. అది కాక ‘లస్ట్‌ స్టోరీస్‌’ వెబ్‌ సిరీస్‌తోనూ బిజీగా ఉంది. రీసెంట్‌గా
ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటించే చాన్స్ కూడా ఆమెకి దొరికినట్టు తెలుస్తోంది. ఒక ప్రెస్టీజియస్‌ బ్యానర్‌‌‌ నిర్మించే ఈ చిత్రంలో బాక్సర్‌‌ గా కనిపించనుంది ఈషా. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమే చెప్పింది. ‘నా నెక్ట్స్ మూవీలో నేను బాక్సర్‌‌గా కనిపించబోతున్నాను. దానికోసం ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాను. తెరపై నిజమైన బాక్సర్‌‌లా కనిపించేందుకు జిమ్నాస్టిక్స్ కూడా నేర్చుకుంటున్నాను. కథ నన్ను బాగా ఇన్‌స్పైర్ చేసింది. ఎప్పుడెప్పుడు బాక్సింగ్ గ్లోవ్స్ వేసుకుని బరిలోకి దిగుదామా అనిపిస్తోంది’ అంటోంది ఉత్సాహంగా. అయితే ఏం సినిమా, డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం రివీల్ చేయలేదు.

For More News..

జీవీకేకు ఇన్వెస్టర్ల లీగల్‌ నోటీసులు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పర్మినెంట్ చేసే ఆలోచనలో ప్రభుత్వం?

ఓల్డెస్ట్ మ్యారిడ్ కపుల్ గా గిన్నిస్ రికార్డ్