గుడ్ నైట్ మూవీ ఫేమ్ నటుడు మణికందన్(Manikandan), తెలుగు నటి శ్రీ గౌరీ ప్రియ(SriGowry priya) జంటగా నటించిన తమిళ చిత్రం లవర్. దర్శకుడు ప్రభ రామ్ వ్యాస్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. దాంతో.. అదే సినిమాను తెలుగులో ట్రూ లవర్ పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఐషు పాత్రలో నటి హరిణి సుందరరాజన్ కనిపించిన విషయం తెలిసిందే. ఆమె కూడా సినిమాలో మంచి నటనను కనబరిచారు.
Also Read :మంజుమ్మల్ బాయ్స్ మూవీకి షాక్.. షోస్ నిలిపివేసిన పీవీఆర్-ఐనాక్స్
ఇక్కడివరకు బాగానే ఉంది కానీ.. సినిమాలో ఆమె(హరిని సుందరరాజన్) చేసిన పాత్రపై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఈ మధ్య ఆ ట్రోలింగ్స్ మరింత ఎక్కువ అవడంతో.. ఎమోషనల్ గా స్పందించారు హరిని. ఇందులో భాగంగా ఆమె తన సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ పై మండిపడ్డారు.. సినిమాలో నా పాత్ర నచ్చకపోతే ఇలా నీచంగా, అగౌరవంగా మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు. ఇకనైనా ఇలాంటి నీచమైన విమర్శలు చేయడం మానుకోండి.. అంటూ రాసుకొచ్చాడు హరిణి. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాల వైరల్ గా మారింది.
Secondly, don’t these thick heads realise that this behaviour only warrants the need for more Aishus?
— Rini (@rinibot) April 10, 2024
Disagreement does not have to be shown with disrespect.
మరి నెటిజన్స్ తీవ్రమైన ట్రోల్స్ చేసేంతలా సినిమాలో హరిణి ఏ పాత్రలో కనిపించారంటే.. ట్రూ లవర్ సినిమాలో అరుణ్ (మణికందన్), దివ్య (శ్రీ గౌరీ ప్రియ) ప్రేమించుకుంటారు. కానీ, కొన్ని కారణాల వల్ల అరుణ్ పై దివ్యకు అభద్రతాభావం ఏర్పడుతుంది. అందుకే.. అరుణ్ కి బ్రేకప్ చెప్పాలనుకుంటుంది. ఇదే విషయాన్నీ దివ్య తన ఫ్రెండ్ ఐషూ(హరిణి సుందరరాజన్) కు చెప్తుంది. తాను కూడా వాళ్ళు విడిపోవడానికి సలహాలు ఇస్తుంది. దీంతో.. చక్కని ప్రేమజంటను విడగొట్టావ్ అంటూ ఆమెపై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ చేశారు, చేస్తున్నారు నెటిజన్స్. అలా తాను చేసిన పాత్ర వల్ల నెటిజన్స్ తో తీవ్రమైన ట్రోలింగ్ కి గురయ్యింది నటి హరిణి.