పిల్ల జమిందార్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ హరిప్రియ. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుందీ ఈ బ్యూటీ. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన హిట్ సినిమా జై సింహ లోను కీలక పాత్రలో నటించి మెప్పించింది.
సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి 2023 జనవరి 26న ప్రముఖ నటుడు వశిష్ఠ సింహను ప్రేమ వివాహం చేసుకుంది.పెళ్లి అయిన రెండేళ్ల తర్వాత ఈ జంటకు మగ బిడ్డ జన్మించాడు. ఆ విషయాన్నీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఫొటోలు షేర్ చేసాడు హరి ప్రియ భర్త నటుడు వశిష్ట సింహ.
ALSO READ | Allu Arjun: బాలకృష్ణకు అల్లు అర్జున్ స్పెషల్ విషెస్.. ఏం చెప్పారంటే?
'బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో హరిప్రియ బిడ్డకు జన్మనిచ్చింది. 'తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారు. మా జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైందని' ఎమోషనల్ గా పోస్ట్ చేసాడు వశిష్ట.
అయితే, పెళ్లి రోజునే బిడ్డకు జన్మనివ్వడంతో ఈ జంట ఆనందంలో మునిగి తేలుతోంది. ప్రతి జంటకు పెళ్లి రోజు అనేది చాలా ప్రత్యేకమైన రోజు. అలాంటి ప్రత్యేకమైన రోజునే బిడ్డకు జన్మనివ్వడం ద్వారా ఆ రోజు మరింత స్పెషల్గా మారింది.