బెంగళూర్ రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో సినీ నటి హేమ పోలీసుల విచారణకు హాజరయ్యారు. జూన్ 3 న ఉదయం నుంచి బెంగళూరు సీసీబీ పోలీసులు హేమను విచారిస్తున్నారు.
మే 19న రాత్రి బెంగళూర్ ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో లిక్కర్, డ్రగ్స్, గంజాయితో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారనే సమాచారంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 20వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో దాడులు చేశారు. 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో నటి హేమ కూడా ఉంది. టెస్టుల్లో హేమకు పాజిటివ్ వచ్చింది. దీంతో మే 27న విచారణకు హాజరుకావాలని ఆమెకు పోలీసులు నోటీసులిచ్చారు బెంగళూరు పోలీసులు.
అయితే వైరల్ ఫీవర్ కారణంగా ఎంక్వైరీకి హాజరుకాలేనని బెంగళూరు సీసీబీ పోలీసులకు హేమ లెటర్ రాసింది. హేమ రాసిన లెటర్‌ను సీసీబీ పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో మరోసారి హేమకు నోటీసులిచ్చారు. జూన్ 1న హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయినా హేమ విచారణకు హాజరుకాలేదు. పోలీసులు సీరియస్ గా పరిగణించి హేమకు మరోసారి నోటీసులిచ్చేందుకు సిద్ధమవ్వగా హేమ విచారణకు హాజరయ్యారు.