డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చింది.. మా సభ్యత్వం ఇవ్వండి : హేమ

డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చింది.. మా సభ్యత్వం ఇవ్వండి : హేమ

నటి హేమ.. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ దొరకటంపై అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేసన్.. మా సభ్యత్వం రద్దు చేశారు. లేటెస్ట్ గా డ్రగ్స్ టెస్టులో నటి హేమకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందంట.. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. మా సభ్యత్వం మళ్లీ తిరిగి ఇవ్వాలని కోరుతూ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి విన్నవించుకున్నది హేమ. 

షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా.. ముందస్తు సమాచారం లేకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి తొలగించటంపై ఆవేదన వ్యక్తం చేశారామె. నిజానిజాలు తెలుసుకోకుండా.. ఏం జరిగిందో చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నారని.. ఇప్పుడు డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చిందని.. వెంటనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వం తిరిగి ఇవ్వాలని కోరారు హేమ. 

ఈ మేరకు అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి వినతిపత్రం ఇచ్చారామె. మిగతా ఆర్టిస్టులు, అసోసియేషన్ సభ్యులు తనకు మద్దతు ఇవ్వాలని కోరారామె.