
కరాటే కల్యాణి, తమన్నా సింహాద్రికి నటి హేమ లీగల్ నోటీసులు పంపింది. గతంలో తన పరువుప్రతిష్టకు భంగం కలిగేలా ఈ ఇద్దరూ వ్యాఖ్యలు చేశారని ఆ నోటీసుల్లో హేమ పేర్కొంది. రెండు యూట్యూబ్ ఛానెల్స్ పైనా చట్టపరమైన చర్యలకు హేమ సిద్ధమైంది. హేమ లీగల్ టీమ్తో తమన్నా సింహాద్రి మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు సమాచారం. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం రచ్చకెక్కిన సందర్భంలో కూడా నటి హేమ.. తన సహ నటి కరాటే కళ్యాణిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
తన పరువుకి నష్టం వాటిల్లే విధంగా సోషల్ మీడియాలో వ్యాఖయలు చేస్తున్నారంటూ నటి హేమ అప్పట్లో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నరేష్, కరాటే కళ్యాణిలు కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తనపై అభ్యంతరకరమైన పదజాలంతో దూషించారని నటి హేమ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పరువుకు భంగం కలిగించే ఇలాంటి వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
2023, మార్చి 21వ తేదీన కూడా పలు యూట్యూబ్ ఛానళ్లపై సైబర్ క్రైం పోలీసులకు హేమ ఫిర్యాదు చేసింది. తన భర్తతో ఉన్న ఫొటోలకు.. ఫేక్ థంబ్ నెయిల్స్ పెట్టి.. అసత్య ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో స్పష్టం చేసింది. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ.. అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్పై చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో పాటు బతికి ఉన్న సెలబ్రిటీలు చనిపోయారని యూ ట్యూబ్ ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆమె మండిపడింది. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, వెబ్సైట్లు ఇష్టమొచ్చినట్లు రాస్తూ.. మానసిక వేదనకు గురి చేస్తున్నారని.. అలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
నటి హేమ 2023లో తన వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఇందులో భాగంగా భర్త సయ్యద్ జాన్ అహ్మద్‌తో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో నిలబడి కేక్ కట్ చేశారు. స్విమ్మింగ్ పూల్‌లో కోక్ కట్ చేసే సమయంలో భర్త అహ్మద్‌కు హేమ లిప్ లాక్ ఇచ్చారు. ఈ వీడియోను కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో అభ్యంతరకర థంబ్ నెయిల్స్ పెట్టి ప్రచారం చేశారు. దీంతో ఆగ్రహించిన హేమ..అలాంటి ఛానెల్స్‌పై అప్పట్లో ఫిర్యాదు చేశారు.