Hitha ChandraShekar: పిల్లల్ని కనడం కంటే కుక్కను పెంచుకోవడం బెటర్: హితా చంద్రశేఖర్

Hitha ChandraShekar: పిల్లల్ని కనడం కంటే కుక్కను పెంచుకోవడం బెటర్: హితా చంద్రశేఖర్

కన్నడ నటి హితా చంద్రశేఖర్(Hita ChandraShekhar) షాకింగ్ కామెంట్స్ చేశారు. పిల్లల్ని కనడంపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. హితా చంద్రశేఖర్ సినీ నటుడు కిరణ్ శ్రీనివాసన్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి వివాహం జరిగి నాలుగేళ్లు అవుతున్నా పిల్లలు లేకపోవడంపై పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే విషయాన్ని తాజాగా హితా చంద్రశేఖర్ వద్ద ప్రస్తావించగా.. షాకింగ్ కామెంట్స్ చేశారు ఆమె. 

ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ముందునుండే నాకు పిల్లల్ని కనాలనే ఉద్దేశం లేదు. కిరణ్ తో కూడా ఈ విషయం గురించి చెప్పాను. తను కూడా సానుకూలంగా స్పందించాడు. ప్రస్తుతం సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు కదా. ఇలాంటి పరిస్థితుల్లో మరో బిడ్డను ఈ లోకంలోకి తీసుకురావాలా? కిరణ్‌ కూడా అలాగే ఆలోచించాడు. నా దృష్టిలో.. సొంతంగా పిల్లల్ని కనడం కన్నా.. ఓ కుక్క పిల్లని కూడా సొంత బిడ్డలా పెంచుకోవచ్చు. కొంతమంది చివరి రోజుల గురించి మాట్లాడతారు. నాకు దాని గురించి ఏ మాత్రం బాధలేదు.. అని తెలిపారు హితా చంద్రశేఖర్.

నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా బలమైన కారణం ఉంది. ప్రతుతం కాలంలో ఎంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులతో ఉంటున్నారు. వాలెక్కడో.. వీళ్ళెక్కడో. అలాంటపుడు పిల్లలు ఉంది ప్రయోజనం ఏంటి? పిల్లల్ని కనొద్దని నేను అనడంలేదు.. అది నా అభిప్రాయం అని చెప్తున్నా అంతే. ప్రస్తుతం హితా చంద్రశేఖర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.