144 ఏళ్లకు ఓసారి వచ్చే మహా కుంభమేళాకు బాలీవుడ్ బ్యూటీలు క్యూ కడుతున్నారు. ఎందుకంటారా..! గ్లామర్ ప్రపంచానికి గుడ్ బై చెప్పి ఆధ్యాత్మిక బాట పట్టడానికి.. అవును మీరు వింటోంది నిజమే. ఇటీవల అలనాటి అందాల నటి మమతా కులకర్ణి సన్యాసం తీసుకోగా.. తాజాగా మరో బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా ఇషికా తనేజా కూడా అదే మార్గాన్ని ఎంచుకుంది. మహాకుంభ్‌లో పవిత్ర జలాల్లో స్నానం చేసి సన్యాసం పుచ్చుకుంది.
ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న ఈ మాజీ మిస్ ఇండియా.. పొట్టి దుస్తుల్లో మహిళలు డ్యాన్స్ చేయకూడదని బోధించింది. మిస్ ఇండియా, మిస్ వరల్డ్ టైటిళ్ల వల్ల పేరు ప్రఖ్యాతలు లభించినా.. జీవితం మాత్రం పరిపూర్ణమైన ఫీలింగ్ కలగలేదని.. అదే భక్తి మార్గాన్ని ఎంచుకున్నాక ఆ సంతృప్తి దొరికిందని తెలిపింది.
ALSO READ | Thandel: తండేల్ మూవీ రియల్ హీరో జగన్ : సోషల్ మీడియాలో నెటిజన్ల వార్
"నేను గర్వించదగ్గ సనాతనిని. ఇకపై సన్యాసిగానే నా జీవితం. మహా కుంభ్ లో దైవిక శక్తులు ఉన్నాయి. నా జీవితంలో అతిపెద్ద విజయం.. ద్వారక- శారదా పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి జీ మహారాజ్ నుండి దీక్ష పొందడం.." అని ఇషికా తనేజా భక్తి ఉపన్యాసం ఇచ్చింది.
2017లో మిస్ ఇండియాగా ఎంపికైన ఇషికా తనేజా.. 2018లో మిస్ వరల్డ్ టూరిజం టైటిల్ గెలుచుకుంది. 2017లో విడుదలైన 'ఇందు సర్కార్' చిత్రంలో ఇషికా తన నటనతో మెప్పిచింది. 2016లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రాష్ట్రపతి అవార్డు అందుకుంది. 2014లో 60 మోడళ్లపై 60 నిమిషాల్లో 60 పూర్తి ఎయిర్ బ్రష్ మేకప్‌లు పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసింది.
జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేళా.. ఫిబ్రవరి 26న ముగియనుంది. కావున వెళ్లాలనుకునేవారు త్వరగా వెళ్లడం మంచిది.