
ప్రముఖ సీనియర్ నటి జయప్రద (Jaya Prada) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జయప్రద సోదరుడు రాజా బాబు గురువారం (ఫిబ్రవరి 27న) హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన మరణాన్ని ప్రకటిస్తూ జయప్రద ఒక భావోద్వేగ పోస్ట్ ను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది.
" నా అన్నయ్య శ్రీ రాజా బాబు గురువారం మధ్యాహ్నం 3:26 గంటలకు (హైదరాబాద్) దేవుని స్వర్గపు నివాసానికి చేరుకున్నారని మీకు తెలియజేయడానికి చాలా బాధగా ఉంది. దయచేసి అభిమానులందరూ ఆయనను మీ ప్రార్థనలలో ఉంచండి" అంటూ జయప్రద కోరారు.
ప్రస్తుతం జయప్రద షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో ఆమె అభిమానులు, నెటిజన్లు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
నటి జయప్రద తెలుగు, హిందీ సహా ప్యాన్ ఇండియా భాషల్లో నెంబర్ వన్ హీరోయిన్ గా సత్తా చాటారు. అయితే, జయప్రద అన్నయ్య రాజా బాబు సినీ, రాజకీయ రంగాల్లోని వ్యక్తులకు పెద్దగా పరిచయం లేకపోయినా, జయప్రద జీవితంలో ఆయన ఒక ముఖ్యమైన భాగం. దాంతో రాజాబాబు మృతిపట్ల ప్రతిఒక్కరూ సంతాపం తెలియజేస్తున్నారు.