
ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుత ఎన్నికలు చాలా కీలకం అని అన్నారు ప్రముఖ సినీనటి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనేత జయసుధ. ఆంధ్ర ప్రజలకు మేలు జరగాలంటే జగన్ సీఎం చేయాలని కోరారు. జగన్ మాట మీద నిలబడే వ్యక్తి అని.. ఇచ్చిన హామీలు ఆయన తప్పక నెరవేరుస్తారని చెప్పారు. ఆంధ్ర ప్రజలు జగన్ కు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని కోరారు జయసుధ.
తొమ్మిది ఏళ్ళు ప్రజల మధ్య గడిపిన జగన్ వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారని చెప్పారు జయసుధ. తప్పుడు కేసులు ఎన్ని బనాయించినా ప్రజల కోసం వెనక్కి తగ్గని దృఢమైన వ్యక్తి వైయస్ జగన్ అని అన్నారు. ఐదేళ్లు చంద్రబాబు పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. .ఆయన చేసిన వాగ్దానాలు ఏవీ అమలు చేయలేకపోయారని చెప్పారు. ఎన్నో ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సినిమా రంగానికి చెసిందేమీలేదని చెప్పారు. సినిమా రంగం నుంచి 80శాతం మంది జగన్ కు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. సినీరంగానికి చెందిన వ్యక్తులు మనస్పూర్తిగా ఇష్టపడితేనే ఎవరికైనా మధ్దతు ఇస్తారని అన్నారు. వైయస్ జగన్ తన తండ్రిలాగా మాట ఇస్తే మడమ తిప్పే రకం కాదని చెప్పారు.