ఎలాంటి విచారణకైనా సిద్ధం.. డ్రగ్స్ కేసుపై స్పందించిన నటి జ్యోతి

కేపీ చౌదరి డ్రగ్స్ వ్యవహారంలో తన పేరు వినిపించడంపై టాలీవుడ్ నటి జ్యోతి స్పందించారు. ఈ డ్రగ్స్ కేసులో తాను ఇన్వాల్వ్ అవలేదు అంటూ.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియో పోస్ట్ చేశారు జ్యోతి. ఈ వీడియోలో సుదీర్ఘంగా మాట్లాడిన జ్యోతి... కేపీ చౌదరితో తనకు కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉందని, కేవలం ఫ్యామిలీ బాండింగ్ తప్ప అతను చేస్తున్న ఈ డ్రగ్స్‌ డీలింగ్ తో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. 

ALSOREAD:సోనీ కొత్త టీవీ.. ధరలు రూ.1.40 లక్షల నుంచి స్టార్ట్​

ఈ కేసు నిమిత్తం ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని, తన ఫోన్ పోలీసులు తీసుకున్నా, ఫోన్  నుండి డేటా రిట్రీవ్ చేసుకున్న తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు జ్యోతి. నా లైఫ్ లో ఇప్పటివరకు డ్రగ్స్ కన్ఫ్యూమ్ చేయలేదు, ఏ తప్పు చేయలేదు, అందుకే ఎవరికీ భయపడేదిలేదు. దయచేసి ఇలాంటి విషయాల్లో మీడియా కాస్త బాధ్యతగా వ్యవహరించాలని, వాస్తవాలను ప్రచారం చేయాలని తెలిపారు జ్యోతి. ప్రస్తుతం జ్యోతి చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.