గౌరవంగా మరణించే హక్కు కల్పించిన ప్రభుత్వం.. ప్రశంసించిన వెటరన్ హీరోయిన్..

గౌరవంగా మరణించే హక్కు కల్పించిన ప్రభుత్వం.. ప్రశంసించిన వెటరన్ హీరోయిన్..

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు గౌరవంగా చనిపోయే హక్కును ఆమోదిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయానికి మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖులు, సినీ సెలబ్రెటీస్  కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న "రైట్ టు డై విత్ డిగ్నిటీ" నిర్ణయానికి మద్దతు తెలియజేస్తున్నారు. బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ కాజోల్ కూడా తన మద్దతు తెలియజేస్తూ ప్రశంసించింది.

ఇందులోభాగంగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఎమోషనల్ స్టోరీ షేర్ చేసింది. నయం కానీ, నొప్పితో కూడిన అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి 'గౌరవంగా చనిపోయే హక్కు' కల్పించిన రాష్ట్రాల్లో దేశంలోనే మొదటగా కర్ణాటక స్టేట్ నిలిచిందని ఇదొక చారిత్రాత్మకమైన నిర్ణయమని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో అనారోగ్యంతో క్షోభ అనుభవిస్తున్న వారికే కాకుండా ఎన్నో కుటుంబాలకి కూడా మేలు కలుగుతుందని తెలిపింది. ముఖ్యంగా చట్టానికి లోబడి "రైట్ టు డై విత్ డిగ్నిటీ" ని  అమలు చేయడం ఎంతోమంచిదని పేర్కొంది. ఈ విషయానికి సంబందించిన ఇంగ్లీష్ ఆర్టికల్ ని కూడా షేర్ చేసింది.

ALSO READ | కిమ్స్లో ఇంకెన్నాళ్లు ఇలా..? శ్రీతేజ్ను కాపాడుకునేందుకు అల్లు అర్జున్ బిగ్ డెసిషన్

అలాగే 2022లో కాజోల్ నటించిన సలాం వెంకీ అనే సినిమా టైటిల్ ని కూడా ట్యాగ్ జతపర్చింది. అయితే సలాం వెంకీ సినిమాలో కాజోల్ ప్రాణంతమైన వ్యాధితో బాధపడుతూ వీల్ చైర్ కి పరిమితమైన యువకుడి తల్లి పాత్రలో నటించింది. ఈ సినిమాకి ప్రముఖ నటి వెటరన్ హీరోయిన్ రేవతి దర్శకత్వం వహించింది. 

ఈ విషయం ఇలా ఉండగా నటి కాజోల్ గత ఏడాది ప్రముఖ డైరెక్టర్ శశాంక్ చతుర్వేది దర్శకత్వం వహించిన "దో పత్తి" అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఈ సినిమా నేరుగా ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం కాజోల్ హిందీలో సర్జమీన్, మహారాగ్ని - రాణుల రాణి, మా, తదితర సినిమాల్లో నటిస్తోంది.