పిల్లల్ని అరవై శాతం ప్రేమిస్తే చాలంటున్న సీనియర్ హీరోయిన్

మీ  పిల్లల్ని ఎంత  ప్రేమిస్తున్నారు?  ఇదేం ప్రశ్న  వందకి వంద శాతం అంటున్నారా!  ఏం పర్లేదు కాస్త టైం తీసుకుని  ఆలోచించండి. దీంట్లో ఆలోచించాల్సింది ఏముంది అనిపిస్తుంది కదా.! నార్మల్​గా ఏ పేరెంట్స్​ని అడిగినా ఇలాగే ఆన్సర్​ ఇస్తారు. కానీ, బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కాజోల్​ మాత్రం పిల్లల్ని అరవైశాతం ప్రేమిస్తే చాలంటోంది.

రీసెంట్​గా‘ త్రిభంగ’ అనే సినిమాలో నటించింది కాజోల్​. త్రీ జనరేషన్స్​లో తల్లీ కూతుళ్ల రిలేషన్​షిప్​ ఎలా ఉంది అనేది ఆ సినిమా కథ. ఆ ఫిల్మ్​ ప్రమోషన్స్​లో భాగంగా  ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజోల్​ ఇద్దరు పిల్లల తల్లిగా తన ఎక్స్​పీరియెన్స్​ని షేర్​ చేసుకుంది.

‘‘సమాజం దృష్టిలో తల్లి​ ఎప్పుడూ ఓ బాక్స్​లో  లాక్​ చేసి ఉండాలి. ఆ బాక్స్​ దాటి అడుగు బయటపెడితే జడ్జ్​ చేయడం మొదలుపెడతారు. పిల్లల కోసం దగ్గరుండి వంటచేయకపోతే  తల్లిగా ఫెయిల్​ చేస్తారు. పిల్లల్ని స్కూల్​ నుంచి పిక్​ చేసుకోకపోయినా, పేరెంట్స్​ మీటింగ్​ ఒక్కటి స్కిప్​ చేసినా, అన్నింటికన్నా  ముఖ్యంగా పిల్లల్ని వదిలి  బయటికెళ్లి పనిచేస్తే  ‘చెడ్డ తల్లి’ అనే ముద్ర వేస్తుంది సొసైటీ​​. అంతేకాదు పిల్లల్ని అన్ని పరిస్థితుల్లో వందశాతం ప్రేమించలేం. ఈ విషయం తల్లైతేనే తెలుస్తుంది. చాలామంది తల్లుల్లు ఈ విషయంలో నాతో ఏకీభవిస్తారు. వాళ్ల అల్లరి మితిమీరినప్పుడు, మొండితనం రెట్టింపు అయినప్పుడు, అయినదానికి కానిదానికి విసిగించినప్పుడు పిల్లల్ని  మనస్ఫూర్తిగా ప్రేమించలేం. ఆ సందర్భాల్లో 60 శాతం ప్రేమని మెయింటెయిన్​ చేస్తే పిల్లలతో పేరెంట్స్​ రిలేషన్​ పర్ఫెక్ట్​గా ఉంద’’ని అర్థం అంటోంది కాజోల్​.

For More News..

మమత హ్యాట్రిక్ సీఎం కావడం కష్టమే!

డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ పీస్ ప్రైజ్‌‌

అప్పుడేమో పాస్ చేస్తమన్నరు.. ఇప్పుడేమో పరీక్ష రాయాలంటున్నరు