తెలుగు, తమిళ అలనాటి నటి రాధ కుమార్తె, రంగం ఫేమ్ కార్తీక నాయర్(Karthika Nair) పెళ్లి ఘనంగా జరిగింది. కేరళ తిరువనంతపురంలోని ఉదయ్ సముద్ర లీజర్ బీచ్ హోటల్‌లో కార్తీక నాయర్-రోహిత్ మీనన్ మూడు మూళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.
ఈ ఈవెంట్కు కుటుంసభ్యులతో పాటు చిరంజీవి- సురేఖ దంపతులు, రాధిక, సుహాసిని, రేవతి సహా పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు హాజరై..నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Actress #Rehka 's daughter#KarthikaNair wedding pic ?
— Aadhavi (@Classicparktv) November 19, 2023
Part 01#TamilCinema pic.twitter.com/fTxqMi9ZFQ
ఇక కార్తీక చేసిన సినిమాల విషయానికి వస్తే..ఆమె తెలుగులో నాగచైతన్య హీరోగా వచ్చిన జోష్ సినిమాతో హీరోయినా గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఆ తరువాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దమ్ము, అల్లరి నరేష్ బ్రథర్ అఫ్ బొమ్మాలి వంటి సినిమాల్లో నటించారు. అవేవి కూడా ఆశించినంతగా ఆడకపోవడంతో ఆమె కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
Actress Radha’s Daughter Karthika Nair Wedding ? pic.twitter.com/fJLWI5BJto
— Christopher Kanagaraj (@Chrissuccess) November 19, 2023