సోషల్ మీడియాలో ఎదో ఒక విషయంపై మాట్లాడుతూ కాంట్రవర్సీలలో నిలుస్తుంటుంది ప్రముఖ తమిళ్ నటి కస్తూరి శంకర్. అయితే నటి కస్తూరి శంకర్ ఇంటింటి గృహ లక్ష్మి(సీరియల్), అన్నమయ్య వంటివాటితో తెలుగు ఆడియన్స్ కి కూడా సుపరిచితమే. కస్తూరి ఇటీవలే తమిళనాడులోని తెలుగు ప్రజలపై పలు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అరెస్టయి జైలుకెళ్లి వచ్చింది. దీంతో జైలు అనుభావాల గురించి ఆడియన్స్ తో పంచుకుంది.
అయితే తాను కేవలం ఆరోపణలు మీద మొదటిసారి జైలుకెళ్ళినందుకు నియమ నిబంధనలు తెలియవని దాంతో మొదట్లో ఇబ్బంది పడ్డానని తెలిపింది. అలాగే జ్యుడిషయల్ కస్టడీమీద జెలుకి వెళ్లేవారు తమ వెంట బట్టలు టూత్ బ్రష్, సబ్బు వంటివి కూడా తీసుకెళ్లాలని తనకి తెలియదని దాంతో తనని అరెస్ట్ చేసిన మహిళా పోలీసులు ఇవన్నీ తనకి కొని ఇచ్చారని తెలిపింది.
ఇక జైలు లోపలికి వెళ్లే సమయంలో కేవలం 4 జతల బట్టలు మాత్రమే అనుమతిస్తారని, తినుబండారాలు వంటివి మాత్రం అస్సులు తీసుకెళ్లనివ్వరని చెప్పుకొచ్చింది. ఒకవేళ ఖైదీలని చూసేందుకు వచ్చిన వారు బట్టలు లేదా ఆహారం బయటినుంచి తీసుకొస్తే చెక్ చేసి లోపలకి అనుమతిస్తారని తెలిపింది.
ఈ విషయం ఇలా ఉండగా నటి కస్తూరి శంకర్ మొదటి ఇన్నింగ్స్ లో ప్రముఖ హీరో నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమాలో హీరో మరదలి పాత్రలో నటించింది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కానీ తమిళ్ లో ఆఫర్లు ఎక్కువగా రావడంతో టాలీవుడ్ ని పక్కన పెట్టింది. ఆ తర్వాత స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా తెలుగులో సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభించింది. దీంతో తెలుగుతోపాటూ తమిళ్ లో కూడా వరుస ఆఫర్లు వరిస్తున్నాయి.