చెన్నై: తెలుగు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరికి ఎగ్మోర్ మెట్రోపాలిటన్ న్యాయ స్థానం నవంబర్ 29 వరకూ12 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పుళల్ సెంట్రల్ జైలుకి ఆమెను తరలించారు. ఆమెను జైలుకి తరలించే సందర్భంలో పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది.
మీడియాను గమనించిన కస్తూరి నినాదాలు చేశారు. శనివారం రాత్రి హైదరాబాద్లో చెన్నై పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలోనే ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
ALSO READ | గచ్చిబౌలిలో సినీ నటి కస్తూరి అరెస్ట్.. నెక్ట్స్ జరగబోయేది ఇదే..!
నటి కస్తూరి ముందస్తు బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ఎట్టకేలకు నిన్న (శనివారం, నవంబర్ 16) రాత్రి హైదరాబాద్ లో నటి కస్తూరి ఆచూకీ కనిపెట్టిన చెన్నై పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. నవంబర్ 3న చెన్నైలోని బ్రాహ్మణ సమాజ సమ్మేళనం కార్యక్రమంలో కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
— PARI'sPapa UK Gupta 💙 (@TechButthead) November 4, 2024
తమిళనాడులో ఉంటున్న తెలుగు ప్రజలు 300 ఏళ్ల క్రితం తమిళ రాజుల భార్యలకు సేవలు చేయడానికి వచ్చారని.. కానీ ఇప్పుడు ఆ తెలుగోళ్లే తమిళ వాళ్లమని చెప్పుకుంటూ చలామణీ అవుతున్నారని కస్తూరి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజలతో పాటు తెలుగు రాష్ట్రాలు కూడా కస్తూరి వ్యాఖ్యలపై భగ్గుమన్నాయి.
ఈ వ్యాఖ్యలు చేసినందుకు తమిళనాడులో ఆమెపై కేసు నమోదైంది. అరెస్ట్ భయంతో ఇన్ని రోజులుగా కస్తూరి పరారీలో ఉంది. కస్తూరి ఆచూకీ తెలుసుకుని, ఆమెను అరెస్ట్ చేసేందుకు గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ ఒక స్పెషల్ టీంను హైదరాబాద్కు పంపింది. చెన్నై పోలీసులు ఎట్టకేలకు ఆమెను శనివారం(నవంబర్ 16, 2024) గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు.