'దసరా' నుంచి కీర్తి సురేశ్ ఫస్ట్ లుక్

'దసరా' నుంచి కీర్తి సురేశ్ ఫస్ట్ లుక్

నేచురల్‌ స్టార్‌ నాని లేటెస్ట్ చిత్రం దసరాకు సంబంధించి ఓ అపడేట్ వచ్చింది. మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ బర్త్ డే సందర్భంగా తాజాగా ఈ చిత్రంలో ఆమె గెటప్ ను రివీల్ చేస్తూ.. ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఎల్లో కలర్ సారీ కట్టుకొని పెళ్లి కూతురు గెటప్ ఉన్న కీర్తి సురేశ్.. ఈ సినిమాలో వెన్నెల పాత్రను పోషిస్తున్నట్టు ఈ పోస్టర్ ద్వారా నిర్వాహకులు తెలియజేశారు. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్  ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. 

సింగరేణి బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ మూవీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతోంది. ఈ పిక్చర్ ఇప్పటికే 30శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు.