ఖమ్మంలో చెన్నై షాపింగ్​ మాల్

ఖమ్మంలో చెన్నై షాపింగ్​ మాల్

ఖమ్మం, వెలుగు:  అధునాతన హంగులతో సరికొత్త గా రూపుదిద్దుకున్న చెన్నై షాపింగ్ మాల్ ఖమ్మంలో అట్టహాసంగా ప్రారంభమైంది. నగరంలోని బైపాస్ రోడ్డు కొత్త బస్టాండ్ సమీపంలో నిర్మించిన 17వ చెన్నై షాపింగ్ మాల్​ను ప్రముఖ సినీ నటి కృతిశెట్టి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  అజయ్ కుమార్ ప్రారంభించారు.  

షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్లు మర్రి జనార్ధన్ రెడ్డి, మర్రి వెంకటరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, మర్రి జమునా రెడ్డి, మర్రి మధుమతి జ్యోతి ప్రజ్వలన చేశారు. పట్టు ఫ్యాన్సీ శారీస్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, జ్యూవెలరీ, వస్త్రాభరణాల విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కృతిశెట్టి మాట్లాడుతూ- చెన్నై షాపింగ్ మాల్ ది బెస్ట్ షాపింగ్ మాల్ అని కామెంట్​ చేశారు. 

ఖమ్మంలో రెండవ బ్రాంచ్, రాష్ట్రంలో 17వ షోరూం ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. మిగతా సంస్థల షోరూంలలో కంటే నమ్మకమైన, నాణ్యమైన సరసమైన ధరలకు వస్త్రాభరణాలు ఇక్కడ లభిస్తాయని ప్రశంసించారు.  ఏ రకమైన వేడుకకు అయినా వన్నె తెచ్చే వస్త్రాలు చెన్నై షాపింగ్ మాల్ లో అందుబాటులో ఉన్నాయని కృతి అన్నారు. 

‘‘మీ ఆదరాభిమానాలు  నాకు ఎల్లకాలం ఉండాలి. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలి”అని అన్నారు. ఈ సందర్భంగా ఆమె నూతన పట్టు వస్త్రాలను ప్రదర్శించారు. బంగారు, వెండి అభరణాలను ధరించారు. ఈ సినీ నటిని చూడటానికి అభిమానులు భారీగా తరలివచ్చారు.  కేరళ కళాకారుల నృత్యాలు, జబర్దస్త్  టీం, శివారెడ్డి, ముక్కు అవినాష్, అదిరే అభి, యాంకర్ మృదుల, తాగుబోతు రాజమౌళి హాస్య  వల్లరి అభిమానులను ఆకట్టుకున్నాయి.