టాలీవుడ్ డ్రీమ్‌గర్ల్‌గా పేరు తెచ్చుకున్న మాలాశ్రీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఓ టైంలో ఆమె బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్నారు. సుమన్‌తో ‘బావ బావమరిది’ సినిమా ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది. ప్రస్తుతం మాలాశ్రీ కుమార్తె రాధనా రామ్ సినీ ఎంట్రీ ఇవ్వనుంది.
కన్నడ హీరో దర్శన్‌తో ఓ సినిమా చేస్తోంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దీనిని విడుదల చేయనున్నారు. తరుణ్ సుధీర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం రాధనా యాక్టింగ్, డ్యాన్స్‌లో ట్రైనింగ్ తీసుకుందట.
మాలాశ్రీ కూతురుగా కాకుండా తనకంటూ ఇండస్ట్రీలో సొంత గుర్తింపు తెచ్చుకునేందుకు కష్టపడతానని తెలిపింది. ఈ బ్యూటీ ఫొటోలు చూసిన వారంతా మాలాశ్రీకి ఇంతపెద్ద కూతురు ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.