హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఇరవై ఏళ్లు దాటినా ఇప్పటికీ అదే గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది నయనతార (Nayanthara). స్టార్ హీరోలకు జంటగా నటిస్తూనే, మరోవైపు ఫిమేల్ లీడ్‌గానూ వరుస చిత్రాలు చేస్తోంది. తనతో పాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చాలామంది హీరోయిన్స్ ఇప్పటికే కనుమరుగైపోగా.. నయన్ మాత్రం వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్నారు.
ఇటీవలే షారుఖ్ తో ఆమె చేసిన జవాన్ మూవీ భారీ విజయం సాధించింది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో మరోసారి నయనతార గ్రాఫ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది.
ఇదిలా ఉంటే.. నయనతార ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు గతంలో వచ్చిన వార్తలను తాజా ఇంటర్వ్యూలో ఖండించింది. తన ముఖాన్ని మార్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నయన్ తనదైన శైలిలో స్పందించింది.
Also Read :- నాగార్జునతో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన అనసూయ
"నా కనుబొమలు అంటే నాకు చాలా ఇష్టం. వాటి ఆకారాన్ని మార్చడాన్నికి మాత్రమే ఇష్టపడతానని వెల్లడించింది. నేను కొన్ని సంవత్సరాలుగా పలు ఈవెంట్లలలో విభిన్న కనుబొమ్మలను మార్చుతుంటాను.బహుశా అందుకే నా ముఖం మారుతుందని ప్రజలు అనుకుంటున్నారు. అయితే.. వాళ్లు అనుకున్నది నిజం కాదు.. అలాగే డైటింగ్ వల్ల కూడా నా ముఖంలో మార్పులు రావచ్చు. ఒక్కోసారి బుగ్గులు వచ్చినట్లు కనిపిస్తుంటాయి. మరోసారి అవి లోపలికి వెళ్లినట్లు అనిపిస్తుంటుంది. కావాలంటే మీరు నన్ను గిచ్చి చూడొచ్చు.. నా శరీరంలో ఎక్కడా ప్లాస్టిక్ ఉండదు" అని నయనతార సరదాగా చెప్పారు.
అంతేకాకూండా.. నయన్ సన్నగా కనిపించేందుకు లైపోసక్షన్ చేయించుకుందని కూడా ఆరోపణలు వచ్చాయి. కొన్నేళ్లుగా తన బరువు ఎలా హెచ్చుతగ్గులకు లోనవుతోందనే దాని గురించి ఆమె మాట్లాడుతూ కేవలం నేను మెయింటేన్ చేసే డైట్ వల్లే అంటూ క్లారిటీ ఇచ్చింది. దాంతో నయనతార ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు వస్తోన్న రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టింది.
The Secrets behind Beautiful Skin ✨ pic.twitter.com/9IGUDk98M6
— Nayanthara✨ (@NayantharaU) October 27, 2024
ఇకపోతే.. నయనతార సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె.. ప్రస్తుతం ఆమె ది టెస్ట్(The Test) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో సిద్దార్థ్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మలయాళం సినిమాలో నటిస్తోంది. కొత్త దర్శకులు సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్ దర్శకత్వంలో డియర్ స్టూడెంట్స్ అనే చిత్రంలో నటిస్తోంది. గతేడాది 3 సినిమాలతో అలరించిన ఆమె.. ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో టెస్ట్, మన్నన్‌గట్టి సిన్స్ 1960, డియర్ స్టూడెంట్స్, తని ఒరువన్ 2, మూకుథి అమ్మన్ 2 చిత్రాల్లో నటిస్తోంది.