Nehashetty: ఎర్ర చీరలో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నేహా లాట్ ఆఫ్ యాటిట్యూడ్

Nehashetty: ఎర్ర చీరలో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నేహా లాట్ ఆఫ్ యాటిట్యూడ్

టాలీవుడ్లో గ్లామర్ లుక్స్తో ఆకట్టుకునే నటి నేహా శెట్టి (Neha Shetty). 'డీజే టిల్లు'లో రాధిక పాత్రతో కుర్రకారు మనసులు దోచేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఆమె 'బెదురులంక 2012', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, డీజే టిల్లు స్క్వేర్' వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.

సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నేహా.. సోషల్ మీడియాలో కూడా తన ఫ్యాషన్ సెన్స్తో ఫాలోవర్స్ను సంపాదిస్తోంది. తరుచూ తన ఫోటో షూట్స్తో, యూట్యూబ్ షార్ట్ వీడియోస్తో ఫేమస్ అవుతూ వస్తున్న నేహా శెట్టికి సెపెరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకుంది. తన గ్లామర్ లుక్తో సెంటరాఫ్ ఎట్రాక్షన్గా మారిన నేహాకు పలు ఇండస్ట్రీల నుంచి ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంది. 

ALSO READ | ఓటీటీలో దేవర రిలీజ్ అప్పుడేనా..?

తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటో షూట్తో మరోసారి యువతను కట్టేపడేసింది. ఎర్ర చీరలో రిచ్ లుక్తో అద్భుతంగా మెరిసిపోతూ, తన సొగసైన ఫోజులతో ప్రత్యేకంగా ఆకర్షించింది.

'జస్ట్ మీ, ఏ లిటిల్ అండ్ లాట్ ఆఫ్ యాటిట్యూడ్' అంటూ తన గ్లామర్ కి కొత్త డెఫినేషన్ ఇచ్చింది. ఇక అందులో ఆమె ధరించిన మేకప్, జువెలరీ, హెయిర్ స్టైలింగ్ అన్నీ ఆమె అందాన్ని మరింత మెరుగు పరచాయి. దాంతో ఎర్ర చీరలో చాలా బావుంది', 'ఇంకెప్పుడు ఇలాంటి గ్లామర్ రోల్ చూడాలి' అంటూ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.