సినీ రంగుల ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన ఆ తార జీవితాన్ని ఇప్పుడు చీకట్లు కమ్మేశాయి. వెండితెరపై నవ్వులు పూయించిన ఆ నటి ప్రస్తుతం దీన స్థితిలోకి వెళ్లిపోయింది. తనను కాపాడంటూ చేతులెత్తి ఆర్థిస్తోంది. దయనీయ జీవితం గడుపుతున్న నటి పావలా శ్యామల(Pavala shyamala) స్థితి ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. కంటతడి పెట్టిస్తోంది.
తన విలక్షణమైన హాస్య నటనతో దశాబ్దాలుగా ఎంతో మంది పెదాలపై నవ్వులు పూయించిన ఆమె.. చాలాకాలంగా దయనీయ జీవితాన్ని గడుపుతున్నారు. నిస్సాహయస్థితిలో ఆమె ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవైపు ఆర్ధిక భారం, మరోవైపు వయోభారంతో నరకం చూస్తున్నారు ఆమె. ఎదిగిన కూతురు కూడా మంచానికి పరిమితమవ్వడంతో.. మానసిక క్షోభను అనుభవిస్తున్నారు పావలా శ్యామల.
Also Read :- దసరా లోపు ప్రభాస్ ఓ ఇంటివాడు అవుతాడు
ఆమె స్థితిని తెలుసుకొని గతంలో కొంతమంది సహాయం అందించినా.. అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగించాయి. చివరకు తనకు వచ్చిన అవార్డులను అమ్ముకొని బియ్యం, పప్పులు కొనుకొన్నరోజులున్నాయని, పరిస్థితులు ఇలాగే ఉంటే ఏదో ఓ రోజు ఇద్దరం ఆకలితో చనిపోతామని ఆవేదన వ్యక్తం చేశారు పావలా శ్యామల. ఇవన్నీ భరించలేక ఆత్మహత్య చేసుకుందాం అంటే.. ధైర్యం సరిపోవడంలేదని చెప్తున్న ఆమె మాటలు గుండెలను పిండేస్తున్నాయి
ఆమె దయనీయ స్థితి తెలుసుకొని ఆమెకు సహాయం చెయ్యాలనుకునేవారు.. Neti Shyamala , A/c: 52012871059, IFSC :SBIN0020458, Srikrishna Nager , Yusuf guda Beanch , Hyderabad , Cell : 98 49 175713 సంప్రదించవచ్చు. ప్రస్తుతం ఆమె ఫిర్జాదీగూడ లోని ఓ వృద్దాశ్రమంలో ఉంటున్నారు. ఆమెకు డబ్బులు, మందులు, నిత్యావసర సరుకులు వంటివి సహాయం చేయాలనుకుంటే.. నేరుగా ఆమె ఇంటికే వెళ్ళి ఇవ్వొచ్చు. మనమందరం మానవతా దృక్పధంతో సినీ కళామతల్లి ముద్దుబిడ్డను కాపాడుకోవాల్సిన సమయమిది.