
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు వివక్షఙకి గురువవుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే నటి పూజా హెగ్డే ఓ ఇంగ్లిష్ న్యూస్ పేపర్ కి ఇంటర్వూ ఇచ్చింది. ఇందులోభాగంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని ట్రీట్ చేసే విధానంపై మాట్లాడుతూ హీరోయిన్స్ కి కనీస వసతులు కల్పించడం లేదని అన్నారు.
హీరోయిన్స్ కి క్యారవాన్ ఇచ్చే విషయంలో భేదాలు చూపిస్తూ హీరోలకి షూటింగ్ స్పాట్ కి దగ్గరగా ఇస్తారని కానీ హీరోయిన్స్ కి మాత్రం షూటింగ్ స్పాట్స్ కి దూరంగా ఇస్తారని ఆవేదని వ్యక్తం చేసింది. దీంతో మేకప్ వేసుకున్న తర్వాత లాంగ్ క్లాత్స్ తో షూటింగ్ కి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండేదని చెప్పుకొచ్చింది. ఇక సినిమా ప్రమోషన్స్ లో రిలీజ్ చేసే పోస్టర్స్ లో కనీసం హీరోయిన్ల పేర్లు కూడా ఉండవని అంతగా వివక్ష చూపిస్తున్నారని చెప్పుకొచ్చింది. దీంతో హీరోయిన్ల విషయంలో పూజా హెగ్డే చేసిన ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ALSO READ | OTTPlay Awards 2025: తెలుగు సినీ స్టార్లకి ఓటీటీ ప్లే అవార్డులు..
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూజా హెగ్డే తమిళ్ లో స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న "రెట్రో" అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాని పాన్ ఇండియా లాంగ్వేజస్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.