
ఈమధ్య కొందరు పాపులర్ కావడానికి సినీ సెలెబ్రటీలని ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలో పబ్లిక్ లో మాట్లాడుతున్న సమయంలో ఆటోగ్రాఫ్, షేక్ హ్యాండ్స్ కోసం ఎగబడుతున్నారు. మరికొందరైతే ఏకంగా ముద్దు పెట్టాడని ప్రయత్నిస్తున్నారు. అయితే హిందీలో పలు బోల్డ్ పాత్రలు, స్పెషల్ సాంగ్స్ చేసిన బాలీవుడ్ నటి పూనమ్ పాండేకి పబ్లిక్ లో ఓ వ్యక్తి ముద్దు పెట్టడానికి ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే నటి పూనమ్ పాండే మీడియాతో మాట్లాడుతుండగా వెనుక నుంచి ఓ వ్యక్తి సడెన్ గా వచ్చి సెల్ఫీ అడిగాడు. దీంతో పూనమ్ కూడా ఓకె చెప్పింది. అయితే సెల్ఫీ తీసుకునే క్రమంలో ఏకంగా ఆ వ్యక్తి మూడు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో పూనమ్ పాండే అతడిని పక్కకి నెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇది గమనించిన కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీంతో కొందరు నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ ఇదంతా కేవలం పూనమ్ పాండే పాపులర్ కావడం కోసం చేసిన స్టంట్ అంటున్నారు. నటి పూనమ్ పాండేకి ఈ మధ్య సినిమా ఆఫర్లు రావడం లేదు. దీంతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఇలాంటివి చేస్తుందని మరికొందరు అంటున్నారు.