టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరైన అనడం కంటే..ఫేమస్ అవుతోన్న నటి ప్రగతి (Pragathi). హీరోయిన్స్ కు మథర్ గా..వదినగా చేస్తూ..పలు విభిన్నమైన పాత్రలను దక్కించుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ ను లీడ్ చేస్తోంది. అప్పట్లో బాబీ మూవీలో మహేష్ బాబు తల్లిగా.. ఆ తర్వాత చిరుత మూవీలో రామ్ చరణ్ కు తల్లిగా ఎమోషన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రీసెంట్ గా అనిల్ రావిపూడి ఏఫ్2 మూవీతోనూ మరోసారి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పొందారు.
ప్రస్తుతం ఆమె తన భర్తతో విడిపోయి..తన కూతురుతో గడుపుతూ.. వరుసగా సినిమాలు చేస్తోంది. తాను సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రొడ్యూసర్ తో ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ కథనాలపై తాజాగా ప్రగతి తన ఇన్ స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. తనపై వచ్చిన రూమర్స్ ను తీవ్రంగా ఖండించింది. ఒకవేళ రెండో పెళ్లి కనుక చేసుకుంటే.. తానే ముందుగా చెబుతానని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కొంతకాలంగా ప్రగతి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. తరచుగా జిమ్ వీడియోలు, డ్యాన్స్ చేస్తూ రీల్స్ ను పోస్ట్ చేస్తూ బాగా పాపులర్ అయ్యారు.
సాక్షి అంటే నీ పెత్తందారుల నిలయం ..
— Swathi Reddy (@Swathireddytdp) October 30, 2023
అడుక్కునే స్టేజి నుంచి అడ్డదారుల్లో మొలిచిన విష బీజం
డబ్బులకోసం వార్తలు లేకపోతే అమ్మాయిలకి రంకు తనం అంటగట్టి దాని మీద డబ్బులు పీక్కుతినే బ్యాచ్
మీరు ఒక లెక్క మేడం ..రేపు నుంచి పెటియం కుక్కలు మిమ్మల్ని ఇంకా నీచాతి నీచం గ ట్రోల్ చేస్తారు… pic.twitter.com/OfpJnuCHNU