దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ కొనసాగిన ప్రియమణి పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్లో వరుస సినిమాలతో దూసుకెళ్తంది.
సినిమాలతో పాటు పలు టీవీ షోలు, వెబ్ సిరీస్లు చేస్తూ అటు వెండితెర, ఇటు బుల్లితెరను ఏలేస్తోంది. ఇటీవలే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం హిందీలో ఫ్యామిలీ మ్యాన్ 3' అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది ప్రియమణి.
తాజాగా ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేయాలని ఉందని చెప్పింది. "మణి సర్ నుంచి ఫోన్ వస్తే నటించేందుకు వెళ్లిపోతానంతే అంటోంది. ఆయన సినిమాలో నటించడం గొప్ప విషయముని చెబుతోంది. ఆయన చేసిన సినిమాలకు మంచి పేరుతో పాటు నటించిన నటులకు మంచి గుర్తింపు వస్తోంది.
Also Read : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తల్లి కన్నుమూత
గతంలో మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన రావణ్ సినిమాలో నటించింది ప్రియమణి. ప్రస్తుతం మరొక్క చాన్స్ ఇస్తే సంతోషంగా నటిస్తా. మణి సార్ నుండి ఫోన్ రాగానే సినిమాలో నటించడానికి చేయి కోసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాను. ఆయన చేసిన సినిమాలు, ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ చూస్తే ఎలాగైనా ఆయన సినిమాలో నటించాలనే కోరిక పుడుతుందని" ప్రియమణి తెలిపింది.