జస్టిస్ హేమ కమిటీపై స్పందించిన టాలీవుడ్ హీరోయిన్...

జస్టిస్ హేమ కమిటీపై స్పందించిన టాలీవుడ్ హీరోయిన్...

టాలీవుడ్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన నటి ప్రియమణి తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. కాగా నటి ప్రియమణి స్పెషల్ సాంగ్స్  లో నటించి కుర్రకారు గుండెల్లో హీట్ పెంచేసింది. అలాగే పలు డ్యాన్స్ కాంపిటీషన్ షోలలో జడ్జిగా కూడా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.

నటి ప్రియమణి  ప్రతీ ఏటా సినీ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా  నిర్వహించే ఐఫా (IIFA ) 2024 అవార్డుల వేడుకలో పాల్గొంది. ఇందులోభాగంగా రెడ్ కార్పెట్ తో మాట్లాడుతూ కేరళలోని జస్టిస్ హేమ కమిటీ గురించి స్పందించింది. జస్టిస్ హేమ కమిటీ వంటివి ఇతర సినీ పరిశ్రమల్లో కూడా ఏర్పాటు చెయ్యాలని అప్పుడే మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వెయ్యచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. 

ALSO READ | రజినీకాంత్ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్

మహిళలు పనిచేసే చోట భద్రత లేకపోతే ఎలా అని కాబట్టి ప్రతీ కార్యాలయంలో మహిళల భద్రతకోసం స్పెషల్ కమిటీలు వంటివి ఏర్పాటు చెయ్యాలని తెలిపింది. ఇక జస్టిస్ హేమ కమిటీకి సంబందించిన విషయాలు తాను డైలీ తెలుసుకుంటున్నానని అలాగే ఈ కమిటీ వలన త్వరలోనే మరింతమంది ధైర్యంగా  బయటికొచ్చి తాము ఎదుర్కున్న సమస్యల గురించి మాట్లాడుతారని చెప్పుకొచ్చింది. 

ఈ విషయం ఇలా ఉండగా నటి ప్రియమణి నటించిన "మైదాన్" మరియు "ఆర్టికల్ 370" చిత్రాలకి అవార్డులు లభించాయి.